Tollywood Hero : వామ్మో.. ఆ హీరోకి ఎంత క‌ష్టం వ‌చ్చింది.. ఏకంగా 24 కేజీల బ‌రువు త‌గ్గాడా..!

Advertisement

Tollywood Hero: టాలీవుడ్ యువ హీరో సందీప్ కిష‌న్ వైవిధ్య‌మైన చిత్రాలు చేస్తున్నా కూడా అవి ప్రేక్ష‌కుల‌ని పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోతున్నాయి. ప్ర‌తి సినిమా కోసం ఫుల్ ఎఫ‌ర్ట్స్ పెడుతుంటాడు సందీప్ కిష‌న్. ప్ర‌స్తుతం పాన్‌ ఇండియా స్టోరీ నేపథ్యంలో విజయ్‌ సేతుపతి కాంబినేషన్ లో మైఖేల్ అనే చిత్రం చేస్తున్నాడు సందీప్ కిష‌న్. స్టార్‌ డైరెక్టర్ గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. స్టన్నింగ్‌ విజువల్స్‌తో రూపొందించిన మైఖేల్‌ టీజర్‌ను మేకర్స్‌ లాంఛ్‌ చేశారు. శ్యామ్‌ సీఎస్‌ కంపోజ్‌ చేసిన బీజీఎం సినిమాపై క్యూరియాసిటీ రేకెత్తిస్తోంది.ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్‌, అనసూయ గ్లామరస్‌ రోల్స్‌లో కనిపిస్తుండగా..గౌతమ్‌ మీనన్‌, వరుణ్‌ సందేశ్‌, విజయ్‌ సేతుపతి స్టన్నింగ్‌ పర్‌ఫార్మెన్స్‌ తో అదరగొట్టబోతున్నట్టు టీజర్‌తో తెలిసిపోతుంది.

Advertisement

మైఖేల్ చిత్రం గ్యాంగ్‌ స్టర్‌ డ్రామాగా వస్తోంది. సందీప్‌ కిషన్‌ ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌తో కనిపిస్తూ..ఈ సారి సూపర్‌ హిట్ట కొట్టడం పక్కా అని చెప్ప‌క‌నే చెబుతున్నాడు. అయితే ఈ సినిమా కోసం సందీప్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఏకంగా 24 కేజీల బ‌రువు త‌గ్గాడు. ఈ విష‌యాన్ని టీజ‌ర్ లాంచింగ్ కార్య‌క్ర‌మంలో తెలియ‌జేశాడు. లైఫ్ లో మనకి ఏది కరెక్టు .. ఏది రాంగ్ అని చాలామంది చెబుతుంటారు. కానీ మన కెపాసిటి ఎంత అనే విషయంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనల్ని మనం ఏ స్థాయిలో చూసుకోవచ్చు .. ఎక్కడి వరకూ వెళ్లొచ్చు అనే విషయంలో ఒక అంచనా ఉండాలి. అలా నాకు నేను పెట్టుకున్న టెస్టునే ‘మైఖేల్. ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడాలని డిసైడ్ అయ్యాను.

Advertisement
tollywood hero 24 kgs weight loss
tollywood hero 24 kgs weight loss

Tollywood Hero : చాలా క‌ష్టం..

పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం 24 కేజీలు బరువు తగ్గాను. ఒక రిస్కీ షాట్ ను ఎలా చేయాలో నాకు చూపించడం కోసం నేను లొకేషన్ కి వెళ్లేలోగా రెండుసార్లు చేసేసి రికార్డు చేసిన దర్శకుడు రంజిత్ జయకోడి. అలాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం. ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా ఆయన మూడు సినిమాలకు సైన్ చేయడం నాకు సంతోషాన్ని కలిగించే విషయం. విజయ్ సేతుపతి వంటి ఆర్టిస్టుతో కలిసి నటించడం నాకు లభించిన వరంగా భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్‌పి, క‌ర‌ణ్ సి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై పీ రామ్‌మోహ‌న్ రావు, భ‌ర‌త్ చౌద‌రీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కోలీవుడ్ నటి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క‌పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది

Advertisement