Tollywood Heros : కరోనా సమయంలో నితిన్, రానాలు సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. జయం సినిమాతో హీరోగా పరిచయమైనటువంటి నితిన్ ఆ తర్వాత వరుస సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇటీవల నితిన్ వరుస సినిమాలతో అలరించినప్పటికీ పెద్దగా సక్సెస్‌లు అందుకోవడం లేదు. మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నితిన్ త్వరలో తన అభిమానులకి గుడ్ న్యూస్ అందిచంనున్నాడట. నితిన్.. నాగర్ కర్నూల్ కి చెందిన డాక్టర్ సంపత్ కుమార్.. డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె అయిన డాక్టర్ శాలినిని ప్రేమించి వివాహం చేసుకోగా, ఆమె ప్రస్తుతం ప్రగ్నెంట్ అని తెలుస్తుంది. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వనుందని అంటున్నారు. నితిన్, షాలిని జంట ఎట్టకేలకు 2020లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇక రానా విషయానికి వస్తే.. ప్రస్తుతం హీరోగానే కాకుండా వైవిధ్యమైన పాత్రల్లోనూ యాక్టర్‌గా తనేంటో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. మరో వైపు నిర్మాతగానూ కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేలా సినిమాలను అందిస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్ 8న రానా, మిహిక బజాజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం మేరకు రానా, మిహిక తల్లిదండ్రులు కాబోతున్నారు. త్వరలోనే అభిమానులకు, ప్రేక్షకులకు ఈ దంపతులు గుడ్ న్యూస్ చెబుతారని టాక్. రానా కూడా సరిగ్గా కరోనా సమయంలోనే తాను ప్రేమించిన షాలినిని కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.

Tollywood Heros : శుభ వార్తలు..
ఆ మధ్య రానా, మిహికా విడిపోతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. కాని అవన్నీ అవాస్తవాలే అని తేలింది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో గుర్తింపు ఉన్న వారిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. రామా నాయుడు నిర్మాతగా తనదైన ముద్ర వేయగా, ఆయన తనయుల్లో సురేష్ బాబు అగ్ర నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. సురేష్ బాబు తనయుడు అయిన రానా దగ్గుబాటి హీరోగా నటిస్తూనే తండ్రి బాటలో నడుస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు. త్వరలోనే బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నటించిన వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు కూడా ఇప్పుడు హీరోగా పలకరించేందుకు సిద్దమయ్యాడు.