Bala Krishna : నందమూరి బాలకృష్ణ ఇటీవలి కాలంలో వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తెగ సందడి చేస్తున్నాడు. . బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్ గా వ్యహరించిన టాక్ షో అన్‌స్టాపబుల్. ఒక రకమైన క్రేజ్ తో వచ్చిన ఈ టాక్ షో ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే దానికి కొనసాగింపుగా రెండో సీజన్ ను ప్రారంభించింది ఆహా ఓటీటీ. అన్‌స్టాపబుల్ 2 సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కి సూపర్బ్ రెస్సాన్స్ ఎంత క్రేజ్ తో ప్రారంభమైందో అంతే క్రేజ్‌తో దూసుకుపోతుంది.ఈ షోకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాగా, ఆయన కుమారుడు నారా లోకేష్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. బాలకృష్ణ, చంద్రబాబు ఇద్దరు బావమరుదులు, వియ్యంకులు కావడం ఒకటైతే.. బాలకృష్ణకు నారా లోకేష్ మేనల్లుడే కాకుండా పిల్లనిచ్చిన అల్లుడు కావడంతో ఈ ఎపిసోడ్ పై మరింత క్రేజ్ పెరిగింది.
ఈ సారి గతంలో కంటే మరింతమంది ఆడియన్స్ ని తీసుకొచ్చారు. ఇక మొదటి ఎపిసోడ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ.. సీజన్ 1 అయ్యాక సీజన్ 2 ప్రకటించాక ఎవరెవరో ఏదేదో రాశారు, ఎవరెవరో వస్తారు అని చెప్పారు. నా బంధువుని తీసుకొద్దామనుకున్నా కానీ ప్రజలందరికి బంధువుని తీసుకొద్దామని ఫిక్స్ అయ్యాను అని చెప్పి చంద్రబాబు నాయుడుకి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. బావ బామ్మర్దుల ఎంట్రీతో మొదటి ఎపిసోడ్ గ్రాండ్ గా మొదలైంది. ఇది మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇక సెకండ్ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఇందులో త్రివిక్రమ్ పవన్ కలిసి రాబోతున్నట్టు హింట్ ఇచ్చారు.

Bala Krishna : హింట్ ఇచ్చారు..
అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై ఇప్పట్నుంచే అంచనాలు పెరిగాయి. షోలో ఎంట్రీ ఇవ్వగానే ఈ హీరోలతో కలిసి బాలయ్య డీజేటిల్లు స్టెప్ వేశారు. సిద్దు హెయిర్ స్టైల్ మీద బాలయ్య సరదాగా కౌంటర్ వేశారు. ఎపిసోడ్ లో బాలయ్య ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి ఆటపట్టించారు. త్రివిక్రమ్ కి కూడా కాల్ చేసి మాట్లాడారు. మీరు మాట్లాడితే తప్పకుండా షోకి వస్తానని చెప్పిన బాలయ్య వస్తే ఎవరితో రావాలో తెలుసుగా అంటూ పవన్ అని చెప్పకనే చెప్పాడు. దీంతో త్వరలోనే పవన్ త్రివిక్రమ్ రాబోతున్నారని అంటున్నారు. అక్టోబర్ 21న సెకండ్ ఎపిసోడ్ స్ట్రీమ్ కానుంది.