Adipurush : ఆదిపురుష్ ట్రోలింగ్ చూసి కంట్లో నీళ్ళు పెట్టుకున్న ప్రభాస్?

Advertisement

Adipurush : సాహో, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. అయినా కూడా ఏమాత్రం స్థైర్యం కోల్పోకుండా యంగ్ అండ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నాడు. ఆయన ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఆదిపురుష్ అనేది చిన్న ప్రాజెక్ట్ కాదు. ప్రభాస్ బాహుబలి సిరీస్ విడుదల అయిన తర్వాత ఆదిపురుష్ ను ప్రకటించారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ను తాజాగా మూవీ యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా రాబోతోంది.

Advertisement

ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్, సన్నీసింగ్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక మైథలాజికల్ డ్రామా. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించనున్నాడు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రభాస్ ఫ్యాన్స్ ను ఊసురుమనిపించింది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ పై ఘోరంగా ట్రోల్స్ వస్తున్నాయి.

Advertisement
trolling on adipurush movie teaser
trolling on adipurush movie teaser

Adipurush : రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న సినిమా

ముఖ్యంగా సినిమా గ్రాఫిక్స్ చాలా చీప్ గా ఉన్నాయని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ట్రోలింగ్సే. చిన్నపిల్లల కోసం సినిమా తీశారా? లేక యానిమేషన్ మూవీ తీశారా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను మోషన్ పిక్చర్ టెక్నాలజీతో క్యాప్చర్ చేశారు. ఆ విషయాన్ని మూవీ మేకర్స్ ముందు ప్రేక్షకులకు చెప్పలేదు. ఇది కేవలం మిస్ కమ్యూనికేషన్ వల్ల వచ్చిన సమస్య. అంటే గ్రాఫిక్స్ ద్వారా యానిమేషన్ మూవీగా రూపొందించిన సినిమానే ఇది. ఏది ఏమైనా సినిమాకు వచ్చే ట్రోలింగ్ చూసి మూవీ యూనిట్ కూడా అవాక్కయిందంట. ఇక.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న రిలీజ్ కానుంది.

Advertisement