Unstoppable 2 : నందమూరి బాలకృష్ణ ఈపేరు చెబితే చాలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు, నందమూరి అభిమానులు తొడ కొట్టాల్సిందే. ఒకప్పుడు మాస్, క్లాస్, ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు బాలయ్య బాబు. కానీ.. బాలకృష్ణలో ఒక నటుడు మాత్రమే కాదు.. ఆయనలోని మరో కోణం కూడా ఉంది అని తెలిసేలా చేసింది అన్ స్టాపబుల్ షో. అవును.. ఆహాలో వచ్చిన అన్ స్టాపబుల్ షో ఎంత సూపర్ సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అసలు ఒక హోస్ట్ గా బాలకృష్ణ పనికొస్తారా? అని ఉన్న సందేహంలో ఇక ఆయన లేకుంటే ఈ అన్ స్టాపబుల్ షోనే లేదు అన్నట్టుగా చేశారు బాలకృష్ణ.
ఆయన చేసే హోస్టింగ్ దుమ్ముదుమారం లేపింది. అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఈ మధ్య కాలంలోనే సూపర్ డూపర్ హిట్ అయిన తెలుగు షో. ఆ షో హిట్ అవడం పక్కన పెడితే. ఆ షోతో బాలయ్య బాబుకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం సినిమాల్లోనే కాదు.. బాలయ్య బాబు హోస్టింగ్ లోనూ అదరగొట్టగలడు అని నిరూపించింది ఈ షో. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ ను విడుదల చేశారు.

Unstoppable 2 : అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ విడుదల
వామ్మో.. ట్రైలర్ చూస్తే మాత్రం తట్టుకోలేరు. బాలయ్య విశ్వరూపాన్ని చూపించారు ట్రైలర్ లో. బాలయ్య బాబు చేసే సాహసాలు మామూలుగా లేవు. ఓ గుహలో ఆయన విన్యాసాలు, సాహసాలు చేసి మరీ ఒక పెద్ద ఖడ్గాన్ని ఛేజిక్కించుకుంటాడు. ఆ తర్వాత ఈ సీజన్ డబుల్ డోస్ తో వస్తోంది.. అంటూ బాలకృష్ణ చెబుతారు. అయితే.. ఈ ట్రైలర్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రసారం కానుంది. బాలయ్య బాబు ట్రైలరే ఇలా ఉంటే.. ఇక సీజన్ 2 ను ఎలా ప్లాన్ చేశారో అని బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.