Upasana : మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ సర్వీస్ ద్వారా కూడా అందరి మనసులని గెలుచుకుంది. ఉపాసన ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అనే విషయం తెలిసిందే . ఉపాసనకి నలుగురు అక్కా చెల్లెల్లున్నారు. వీరిలో ఉపాసన రెండోది. పదిహేనేళ్ళకే “యు ఎక్సేంజ్” సేవా సంస్థను నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలను సేకరించి.. పేద పిల్లలకు అందించే వారు.
అంతేకాదు మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించే వారుజ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ గ్రూప్ లలో మూడవ స్థానంలో ఉన్న అపోలో హాస్పిటల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ పనులను ఉపాసన దగ్గరుండి చూసుకుంటున్నారు. .ప్రస్తుతం అపోలో చారిటీకి వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో పనులను విజయవంతంగా నిర్వహిస్తూనే కొణిదెల ఇంట కోడలుగా కుటుంబ సభ్యులందరీ మనసులను గెలుచుకున్నారు. అయితే అన్నీ బాగానే ఉన్నా ఉపాసన తల్లి కాకపోవడం, మెగా వారసుడిని అందించకపోవడం ఇప్పుడు మెగా అభిమానులని కలవరపరుస్తుంది. ఇటీవల ఉపాసన తల్లి కాబోతున్నట్టు తెగ ప్రచారం నడిచింది.

Upasana : ఆశలు ఆవిరి..
ఉపాసనకు ఐదో నెల అని మరికొన్ని రోజుల్లోనే శ్రీమంతం కూడా చేయబోతున్నారు అంటూ ఓ న్యుస్ నెట్టంట వైరల్ గా మారింది. మెగా పవర్ స్టార్ కి కొడుకే పుడతారు అంటూ ఫ్యాన్స్ హంగామా కూడా చేశారు. కాని వారి ఆశలు ఆవిరి అయ్యాయి. దసరా కానుకగా ఇంట్లోనే ఉన్న ఉపాసనతో కలిసి ట్రెండీ వేరులో ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను అభిమానులతో పంచుకోగా, ఇందులో బేబి బంప్ పెద్దగా కనిపించలేదు. దీంతో ఉపాసన ప్రెగ్నెంట్ అని వస్తున్న వార్తలు అన్నీ అడియాశలు అయ్యాయి. ఇక ఉపాసన భర్త రామ్ చరణ్ విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ కొడతాడని అంటున్నారు.