Rashmika Mandanna : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తెలుసు కదా. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషనే. ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒక వివాదాస్పద విషయం గురించి చెబుతుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, తెలుగు సినిమా సెలబ్రిటీలు, ముఖ్యమైన రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వాళ్ల లైఫ్ ఎలా ఉంటుందో ముందూ ఊహించి చెబుతారు. విజయ్ దేవరకొండ జాతకం ఒక్కసారిగా పడిపోయిందని.. ఆయన జాతకంలో చాలా సమస్యలు ఉన్నాయని… ప్రస్తుతం ఆయన జాతకం ప్రకారం సినిమాలు ఆడవని చెప్పిన విషయం తెలిసిందే. వేణు స్వామి చెప్పినట్టుగానే విజయ్ దేవరకొండకు జరుగుతోంది. అలాగే.. ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా గురించి కూడా వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు.
నిజానికి… వేణు స్వామి దగ్గర రష్మిక పలు పూజలు చేయించిందని ఆ పూజల ఫలమే తనకు ఈ స్టార్ డమ్ అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మందన్నా గురించి కూడా వేణు స్వామి పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రష్మిక మందన్నా పాన్ ఇండియా స్టార్, నేషనల్ క్రష్. కేవలం పుష్ప సినిమాతో తన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడ హీరోయిన్ గా ఉన్న రష్మిక.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు మాత్రం ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.

Rashmika Mandanna : ఆ పార్టీలో చేరనుందట
అయితే.. రష్మిక మందన్నా.. కర్ణాటక రాజకీయాల్లో కీలకం కానుందని వేణు స్వామి తెలిపారు. త్వరలోనే తను కన్నడనాట రాజకీయాల్లో ఆరంగేట్రం చేయనుందని అన్నారు. తను కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ కూడా చేస్తుందని వేణు స్వామి స్పష్టం చేశారు. కర్ణాటకలో ఇప్పటికే పలువురు హీరోయిన్లు రాజకీయాల్లోకి వచ్చారు. చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యారు. ఇప్పుడు రష్మిక రావడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి.. వేణు స్వామి చెప్పినట్టు నిజంగానే రష్మిక రాజకీయాల్లోకి వస్తుందా.. కన్నడ రాజకీయాల్లో చక్రం తిప్పుతుందా? నేషనల్ క్రష్ కు ప్రజలు సపోర్ట్ చేస్తారా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.