Samantha : ప్రస్తుతం ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు అసలు కలిసి రావడం లేదని చెప్పాలి. విజయ్ దేవరకొండ లైగర్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా ఇటీవల విడుదలై భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇప్పుడు సమంతతో కలిసి “ఖుషి” మూవీని చేయబోతున్నాడు విజయ్. ఇక ఈ మూవీ ఒకప్పుడు మణిరత్నం తీసిన రోజా సినిమాను పోలీ ఉంటుందని సమాచారం . అయితే దాదాపుగా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయిపోయింది. ఇక సమంత విజయ్ దేవరకొండల మధ్య కొన్ని సీన్స్ మిగిలి ఉన్నాయట. వాస్తవానికైతే ఈ సినిమాను రాబోయే క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు సమంత మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఈమె ఈ వ్యాధి నుండి ఎప్పుడు కోలుకుంటుందో ఎవరికి తెలియని పరిస్థితి. దీంతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇక ఈ సినిమాపై భార్య అంచనాలను పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పాలి. విజయ్ దేవరకొండ సమంత కోసం చూస్తూ కాలం గడిపే కన్నా వేరే సినిమాలను ఓకే చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే దిల్ రాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను ఓకే చేసి అడ్వాన్స్ కూడా తీసుకున్నారట విజయ్.

ఇక ఇప్పుడు ఖుషి మూవీకి బ్రేకులు పడడంతో దిల్ రాజ్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయాల్సిన సినిమాను పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట విజయ్. అలాగే మరొక సినిమాను ప్రముఖ దర్శకుడుతో చేయాలని విజయ్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ దృష్టిలో సుకుమార్, కొరటాల శివ, లాంటి మంచి దర్శకులు ఉన్నారు. కానీ ప్రస్తుతం వారంతా వారి యొక్క షూటింగ్ లో బిజీగా ఉండడంతో విజయ్ దేవరకొండ ఇప్పట్లో వారితో సినిమాలు చేసే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే విజయ్ దేవరకొండకు నడుస్తున్న కాలం అసలు కలిసి రావడం లేదని తెలుస్తోంది.