Vijayashanti : రాములమ్మ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర కథానాయికగా అలరించిన విజయశాంతి ఇప్పుడు రాజకీయాలలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. తెలంగాణ బీజేపీకి చెందిన మహిళా నాయకురాలుగా ఉన్న విజయశాంతి తనకు మాట్లాడే అవకాశం కూడా ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలకే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుందన్న విజయశాంతి .. తనకు బాధ్యతలు ఇవ్వకుండా చేయాలనుకునే వారిపై పరోక్షంగా విమర్శలు గుప్పించింది.
మొత్తానికి ఇటీవల విజయశాంతి రాజకీయాలలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ మధ్య విజయశాంతి టాలీవుడ్ సీనియర్ హీరోలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేయగా, అవి నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. చాలా రోజుల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విజయశాంతి ఆ తరువాత చాలా ఛాన్స్ లు వచ్చినా వద్దనుకుంది విజయశాంతి రాజకీయాల మీదే ఫోకస్ పెట్టింది. ఈ అమ్మడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ సరసన మెరిసి మెప్పించింది. చిరుతో ఎక్కువ సినిమాలు చేసింది విజయశాంతి. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న ఈమె..

Vijayashanti : రాములమ్మ ఘాటు వ్యాఖ్యలు..
ఓ సందర్భంలో ఈ హీరోలందరిని దొంగలు అని అనేసింది. మీబ్యాచ్ హీరోల గురించి చెప్పండి అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గతంలో విజయశాంతిని ప్రశ్నించగా.నా బ్యాచ్ హీరోలంతా ముసుగు వేసుకున్న దొంగలు.. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం కూడా ప్రజల కొరకు ఖర్చు చేయరు. వారు రీల్ లైఫ్‌లోనే హీరోలు. రియల్ లైఫ్ లో కాదు అని దారుణమైన కామెంట్స్ చేసింది. రాజకీయాల్లో ఉన్న తనకు ప్రజలు దండేసి అభినందిద్దాం అని అనుకునే ఒక్క హీరో లేడు. తెలగాణ ఉద్యమం సమంయంలో.. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది.. సపోర్ట్ చేయండి అని అంటే..ఒక్కరు ముందుకు రాలేదని పేర్కొంది.