Vishnu Priya : బుల్లితెర యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితం అయిన విష్ణు ప్రియ యాంకర్‌గా కన్నా నటిగా అంతో ఇంతో పేరు సంపాదించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల అరాచకానికి అడ్డు కట్టలు వేయలేం అంటే అతియోక్తి కాదేమో. వరుసగా అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ పరంగా పిచ్చెక్కిస్తేంది. నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మొన్నటి వరకు ఘాటు ఘాటు అందాలతో మత్తెక్కించే విష్ణు ప్రియ కొద్ది రోజులుగా ట్రెడిషనల్ లుక్స్ లో సందడి చేస్తుంది. మొన్నామధ్య చూడీదార్లో కనిపించగా, ఇప్పుడు చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ రచ్చ లేపుతుంది.
విష్ణు ప్రియ సోయగాలకు కుర్రకారు చిత్తైపోతున్నారు. యాంకర్ గా కాస్తా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ పోతోంది. గ్లామర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇంటర్నెట్ లో ఈ బ్యూటీ హంగామా మినిమమ్ ఉంటోంది. తన గ్లామర్ ఏ మాత్రం దాచుకోకుండా అంతా నెటిజన్ల ముందు పెడుతుండటంతో నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది.మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ యంగ్ లేడీ..

Vishnu Priya : విష్ణు ప్రియ సోయగాలు..
బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా పాపులారిటీ సంపాదించింది. ఇక ఇటీవల విష్ణు ప్రియ ..అఖిల్‌ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అఖిల్ తో ఒక్క ఛాన్స్ కావాలంటూ డైరెక్టర్ లను రిక్వెస్ట్ చేస్తోంది ఈ యంగ్ యాంకర్. అఖిల్ తో డ్యాన్స్ చేసే ఒక్క అవకాశం వస్తే తన జీవితం ధన్యం అంటోంది ఈ అందాల యాంకరమ్మ. ఆమె తీరు చూస్తుంటే అఖిల్ ని అస్సలు వదిలేలా అయితే కనిపించడం లేదు.