Aamani about Soundarya : సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది వస్తుంటారు. నటన పరంగా కానీ, ఇతర టెక్నిషియన్స్ గానీ పని చేస్తుంటారు. ఎందరో వచ్చి వెళ్తుంటారు కానీ.. కొందరు మాత్రమే ఇండస్ట్రీలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటువంటి వాళ్లలో ఒకరు సౌందర్య. అవును.. తన చిరునవ్వుకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. తన అచ్చతెలుగు ఆడతనానికి, తన అందానికి, తన నటనకు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య.. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో చోటు సంపాదించుకుంది. కానీ.. చిన్నతనంలోనే తనను మరణం వెంటాడింది. హెలికాప్టర్ ప్రమాదంలో అనూహ్యంగా సౌందర్య మరణించింది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. తను చనిపోయే సమయంలో గర్భవతి అనే వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి.
అయితే.. సౌందర్య చనిపోయే సమయానికి నిజంగానే గర్భవతా? అనే పలు సంచలన నిజాలను తాజాగా మరో సీనియర్ హీరోయిన్ ఆమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఆమని కూడా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది తెలుగు ఇండస్ట్రీలో. అప్పట్లో సౌందర్య, ఆమని ఒకే సమయంలో ఇండస్ట్రీలో ఉన్నారు. అందులోనూ సౌందర్య.. ఆమనికి బెస్ట్ ఫ్రెండ్ కూడా. నేను సౌందర్య మరణ వార్త వినగానే షాక్ అయ్యాను. నా మనసు ముక్కలు అయింది. సౌందర్య బదులు నేను చనిపోయినా బాగుండేది అని అనుకున్నా. సౌందర్యకు పెళ్లయి పాపం సంవత్సరం కూడా కాలేదు. అప్పటికి సౌందర్య జీవితంలో ఇంకేం చూడలేదు. జీవితంలో అన్నీ చూసిన నేను చనిపోయినా బాగుండు అనిపించింది.. అంటూ భావోద్వేగానికి గురయింది ఆమని.

Aamani about Soundarya : సౌందర్య తమ్ముడు అమర్ ను పెళ్లి చేసుకోవాలని నన్ను అడిగారు
సౌందర్య వాళ్ల అమ్మానాన్నతో ఆమనికి చనువు ఎక్కువట. అందుకే వారికి తను నచ్చడంతో సౌందర్య తమ్ముడు అమర్ ను పెళ్లి చేసుకోవాలని కోరారట. అయితే.. వాళ్లు ఏదో సరదాకు అన్నారేమో అని ఆమని అనుకుందట కానీ.. వాళ్లు మాత్రం నిజంగానే సౌందర్య తమ్ముడితో ఆమనికి పెళ్లి ప్రపోజల్ పెట్టారట. కానీ.. తను అప్పుడు ఎక్కువగా సినిమాల మీద దృష్టి పెట్టడంతో అమర్ తో పెళ్లి కాలేదు అని చెప్పింది ఆమని. ఇక.. సౌందర్య చనిపోయేటప్పటికి ప్రెగ్నెంట్ కాదని.. తను ప్రెగ్నెంట్ అని వార్తలు రాశారని.. అది నిజం కాదని ఆమని తెలిపింది. ఇక.. సౌందర్య పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పింది ఆమని. కానీ.. జీవితంలో ఏం చూడకముందే సౌందర్య.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ ఆమని భావోద్వేగానికి గురయింది.