Prabhas : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే ఇంకో రెండు వారాల్లో రానున్నది. అయితే ఇటీవల పెదనాన్న కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ పుట్టినరోజు సంబరాలు ఉండవేమో అనుకున్నారు అందరు. కానీ రీ రిలీజ్ ల రూపంలో జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.అందులో భాగంగా అక్టోబర్ 15న రెబల్ ని థియేటర్లో విడుదల ,చేస్తున్నామని ప్రకటన చేశారు. ఇక ఈ మూవీ అప్పట్లో డిజాస్టర్ కావడంతో మళ్లీ పాత గాయని ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇక అప్పట్లో సోషల్ మీడియా అంత స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ కళాఖండాన్ని తీర్చిదిద్దున రాఘవేంద్ర లారెన్స్ ను ఒక రేంజ్ లో ట్రోలింగ్ చేసేవారు అభిమానులు. దీంతోపాటు ఊరట కలిగించే మరో వార్త ఉంది. ఇదే నెల 23 ,24 తేదీల్లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన వర్షం ను 4k లో రిలీజ్ చేయనున్నారు. 2004లో వచ్చిన ఈ వర్షం మూవీ ఎన్నో రికార్డులను సృష్టించింది.ప్రభాస్ త్రిష జంటకు మరియు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కు భారీ ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఈ వార్త విన్న అభిమానులు ఇది మంచి నిర్ణయం అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇక రెబల్ ను చూసి తట్టుకోలేము అనుకునేవారు వర్షంను చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే గత రెండు నెలల నుంచి ఈ రి రిలీజ్ ట్రెండు బాగా నడుస్తుంది. వీటిలో భాగంగా రి రిలీజ్ అయిన పోకిరి , ఘరానా మొగుడు, తమ్ముడు, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఒకదాన్ని మించి మరొకటి పోటీపడి కలెక్షన్స్ ను సాధించాయి. ఇక దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ జులై మరియు దేశముదురు రీ రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సింహాద్రి మరియు ఆది సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.