Prabhas : ఫ్యాన్స్ గుండెలు పగిలేలా ఏం పనులయ్యా ప్రభాస్ ఇవి ? చెప్తే అర్ధం కాదా….?

Advertisement

Prabhas : ప్రస్తుతం ప్రభాస్ ఆది పురుష్ , సలార్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నాడు . ఇక ఇప్పుడు స్పిరిట్ వంటి మరో పాన్ ఇండియా సినిమా ప్రభాస్ లైన్లో ఉంది. ఇవే కాకుండా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇంకో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో సీక్రెట్ గా సాగుతుందని సమాచారం. ప్రభాస్ కూడా ఈ చిత్రీకరణలో బుధవారం జాయిన్ అవుతాడని తెలుస్తుంది. ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఇప్పుడు జరుగుతున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ థ్రిల్లర్ గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

అలాగే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రబినయం చేయబోతున్నారని అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు ఉంటారని టాక్. ఆల్రెడీ హీరోయిన్స్ ని కూడా సెలెక్ట్ చేశారని వారిలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ మరో హీరోయిన్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో సంజయ్ దత్ , రోమన్ ఇరానీ వంటి బాలీవుడ్ నటులు కూడా నటించనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాతే నటీనటుల గురించి సినిమా బృందం క్లారిటీ ఇస్తుంది.ఇక ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కనుంది. ఈ సినిమాను మొదట్లో ప్రభాస్ అభిమానులు వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడైతే ప్రభాస్ ను సరికొత్తగా చూపిస్తారని నమ్ముతున్నారు.

Advertisement
What did Prabhas do to break the hearts of fans?
What did Prabhas do to break the hearts of fans?

ఇక ప్రభాస్ చేసే భారీ ప్రాజెక్టు ల మధ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఏదో ప్రత్యేకత ఉందని చెప్పాలి.ఇది ఇలా ఉండగా మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో తర్కెక్కిన ఆది పురుష్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. అలాగే ప్రశాంత్ నిల్ ,దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా వచ్చే ఏడాదిలోపు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ప్రాజెక్టు k కొంచెం టైం పడుతుంది. ఇక ఈ గ్యాప్ లో మారుతి చిత్రాన్ని ప్రభాస్ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

Advertisement