Krishna : సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి ఈ రోజు తెల్లవారుజామున అకాల మరణం చెందారు. ఆమె మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇందిరా దేవి మరణం తర్వాత కృష్ణ, ఇందిరా దేవికి సంబంధించిన అనేక విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందిరా దేవి ఉండగా కృష్ణ మరో పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఆ పెళ్లికి దారితీసిన కారణాలేంటి? కృష్ణ కుటుంబంలోకి విజయనిర్మల ఎలా వచ్చింది? ఇంతకీ కృష్ణకు పిల్లలు ఎంతమంది? లాంటి ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.
సూపర్ స్టార్ కృష్ణ మామ కూతురు ఇందిరాదేవి కాగా, ఆమె వరుసకు మరదలు అవుతుంది. కృష్ణ కుటుంబ సభ్యుల సలహా మేరకు ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నాడు.ఆయన వివాహం తర్వాత నటించి గూడాచారి చిత్రం బంఫర్ హిట్ అయ్యింది. ఈ విజయంతో ఆయనకు ఆఫర్లు వెళ్లువెత్తాయి.ఇక కృష్ణ చేసిన చాలా సినిమాలలో విజయ నిర్మల హీరోయిన్గా చేసేది. దీంతో ఆ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది.అలా ఎవరికీ చెప్పకుండా ఓ ఆయలంలో విజయ నిర్మలను, కృష్ణ పెళ్లి చేసుకున్నాడు. విజయనిర్మలకు పెళ్ళై ఒక అబ్బాయి ఉన్నాడు. భర్తతో ఆమెకు విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కృష్ణకు దగ్గరయ్యారు. విజయనిర్మల కృష్ణకు అండగా ఉంటూ ఆయనకు సలహాదారుగా వ్యవహరించేవారు.

Krishna : కారణం ఇదేనా?
పెళ్లి రహస్యంగా చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిర దగ్గర ఆయన విషయం దాచలేదు. కృష్ణకు మొదటిపెళ్లి జరిగిన నాలుగేళ్లకే విజయ నిర్మలను పెళ్లి చేసుకోవడం విశేషం.ఈ పెళ్లి జరిగినా కూడా తనతోనే ఉంటానని ఇందిరాదేవి చెప్పింది.బతికినంత కాలం ఒకే భర్తగా ఉంటానని చెప్పింది. జయ నిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు. నరేష్ మొదటి భర్తకు పుట్టిన అబ్బాయి. ఇక ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు అబ్బాయిలు కాగా, మంజుల, పద్మావతి, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా ఇందిరా దేవి పబ్లిక్ లో కనిపించడానికి ఇష్టపడరు. మహేష్ బాబు మాత్రం మదర్స్ డే సందర్భంగా తన తల్లి ఫొటో షేర్ చేస్తూ ఆమె గురించి ఎమోషనల్ కామెంట్స్ పెడతాడు.