SS Rajamouli : సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిరా దేవి అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా మూగబోయింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. మహేశ్ బాబు అభిమానులు కూడా చివరిసారిగా ఇందిరా దేవిని చూసేందుకు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. ఇందిరా దేవికి చివరిసారిగా నివాళులు అర్పిస్తున్నారు. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీలో నటిస్తున్నారు. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి సినిమా ఉంటుంది.
ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇందిరాదేవి మరణంతో బాధలో ఉన్న మహేశ్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి మాంచి ఊపునిచ్చే న్యూస్ చెప్పారు. అదే ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటుడి గురించి. నిజానికి ఈ సినిమా ప్రీ పొడక్షన్ టైమ్ లోనే చాలా బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా బడ్జెట్, హీరోయిన్, సినిమా నేపథ్యం.. ఇలా పలు అంశాల విషయంలో సినిమా ప్రతి రోజూ ట్రెండింగ్ లో ఉంటోంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు, అవెజంర్స్ హీరో క్రిస్ హేమ్స్ వర్త నటిస్తున్నాడట. నిజానికి ఈ సినిమాను గ్లోబట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

SS Rajamouli : ఈ సినిమాలో నటించబోయే హాలీవుడ్ నటుడు ఎవరో తెలుసా?
ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక యాత్రికుడిగా మహేశ్ బాబు ఈ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాలో ఒక హాలీవుడ్ నటుడిని తీసుకునే అవకాశం ఉందనే వార్తలు చాలా రోజుల నుంచి గుప్పుమంటున్నాయి. ఇక క్రిస్ ఈ సినిమాలో కన్ఫమ్ అనడానికి ఆధారాలను కూడా మహేశ్ అభిమానులు చూపిస్తున్నారు. తన ఇన్ స్టా అకౌంట్ లో మహేశ్ బాబు.. క్రిస్ ను ఫాలో అవుతున్నారు. నిజానికి.. మహేశ్ బాబు చాలా తక్కువ మందిని ఫాలో అవుతుంటారు. కానీ.. క్రిస్ ను ఫాలో అవుతున్నారంటే ఈ సినిమాలో క్రిస్ కన్ఫమ్ అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి సినిమా అనగానే క్రిస్ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. మరి చూద్దాం.. ఈ సినిమాలో క్రిస్ క్యారెక్టర్ ఏంటో.. ఈ సినిమాకు క్రిస్ వల్ల ఎంత మైలేజ్ వస్తుందో?