Samantha: సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకొని సరిగ్గా ఏడాది అయింది. గత ఏడాది అక్టోబర్ 2న వీరు విడాకులు తీసుకున్నారు. ఏడాది అవుతున్నా కూడా వీరి విడాకులకి సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. ఎవరో ఒకరు వీడి విడాకుల గురించి ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. నాగచైతన్య ( Naga Chaitanya ) మొదటి నుంచి చాలా సౌమ్యంగానే ఉంటాడు. ఎవరి జోలికి పోడు. సమంత మాత్రం చిన్నదానిని కూడా చాలా పెద్దగా చూస్తుంది. చాలా విషయాల్లో వారి నడుమ మనస్పర్థలు వచ్చి చివరకు విడిపోయారు. కానీ కరెక్ట్ రీజన్ ఏంటనేది మాత్రం ఎవరికీ తెలీదు.
వీరిద్దరిలో ముందుగా విడాకులు కోరింది మాత్రం సమంత ( Samantha ) నే అంట. ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నాకు విడాకులు ఇచ్చెయ్ నా బతుకు నేను బతుకుతా అంటూ దారుణంగా మాట్లాడిందట. నాగచైతన్య ఎన్నో సార్లు ఓపిగ్గా చెప్పి చూసినా ఆమె వినిపించుకోకపోవడంతో చేసేదేం లేక విడాకులు ఇచ్చేశాడట. సమంతదే అస్సలు తప్పు అంటూ కొందరు చెప్పుకొస్తుండగా, ఇందులో ఎంత నిజం ఉందనే దానిపై క్లారిటీ అయితే లేదు. ఇటీవల నాగార్జున విడాకులపై స్పందించాడు. నాగ చైతన్య సంతోషంగా లేడు. అదంతా నేను చూశాను. నా వరకైతే మంచిదే అయింది. అతనికి అదొక అనుభవం. దురదృష్టకరం. ఇంకా దీని గురించి మధనపడాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. అది మన చేతుల్లో లేనిది అంటూ పలు కామెంట్స్ చేశారు.

Samantha : ఎవరు అడిగారు…
నాగ చైతన్య, సమంతా విడాకుల వ్యవహారం గత ఏడాది కాలంగా సంచలనంగా మారుతూనే ఉంది.. సమంతా ట్విట్టర్ లో ఎప్పుడైతే పేరు మార్చిందో అక్కడి నుంచి దీనికి సంబంధించి కాస్త హైప్ వచ్చింది. చివరకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత సమంతా వ్యవహారంలో అక్కినేని ఫాన్స్ సీరియస్ గా ఉన్నారు. ఆమె వరుస సినిమాలు చేయడం ఫాన్స్ కు నచ్చడం లేదు. స్పెషల్ సాంగ్స్, కొన్ని దారుణమైన పాత్రలు చేస్తూ అందరికి కోపం తెప్పిస్తుంది. సమంత నాగ చైతన్యల వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.