Mahesh Babu : పొన్నియిన్ సెల్వన్ ఇటీవల విడుదలైన విషయం తెలుసు కదా. సినిమా చాలా అంచనాల మధ్య విడుదలైంది. కానీ.. ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. సినిమా బాగానే ఉన్నప్పటికీ.. చరిత్రకు సంబంధించిన సినిమా కావడం, ఇంకా రెండో పార్ట్ కూడా ఉండటంతో ఈ సినిమాను అర్థం చేసుకోవడంలో కొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమా గురించి ప్రస్తుతం ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పొన్నియిన్ సెల్వన్ మూవీలో మన సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించాలట. షాకింగ్ గా ఉంది కదా.
అసలు ఈ సినిమాకు మణిరత్నం ముందు మహేశ్ బాబునే అనుకున్నారట. అందుకోసమే మహేశ్ బాబును సంప్రదించారట. అలాగే.. కోలీవుడ్ థలైవా విజయ్ కూడా ఈ సినిమాలో నటించాలి. ఇద్దరి కాంబోలో ఈ సినిమాను తీయాలని మణిరత్నం అనుకున్నారు. విజయ్, మహేశ్ బాబు ఇద్దరితో ఫోటోషూట్స్ కూడా జరిపించారట మణిరత్నం. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేయాలని అనుకున్న మణిరత్నం అందుకే విజయ్, మహేశ్ బాబు ఇద్దరిని ఈ సినిమాకు బెస్ట్ చాయిస్ గా అనుకున్నారు. కానీ.. ఈ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చలేదని మహేశ్ బాబు నిరభ్యంతరంగా తిరస్కరించారట. ఆ తర్వాత విజయ్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. నిజానికి మణిరత్నం లాంటి దర్శకుడితో పని చేయాలని, ఆయన దర్శకత్వంలో నటించాలని ఏ హీరోకు అయినా ఉంటుంది.

Mahesh Babu : పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేసిన మణిరత్నం
అందులోనూ మణిరత్నం లాంటి డైరెక్టర్ పాన్ ఇండియా మూవీలో చాన్స్ ఇస్తే ఎందుకు నటించకుండా ఉంటారు. కానీ.. మణిరత్నం ఆఫర్ ను మహేశ్ బాబు, విజయ్ ఎందుకు కాదన్నారో మాత్రం అర్థం కావడం లేదు. అరుళ్మోజి వర్మన్ పాత్రను మహేశ్ బాబుకు ఇచ్చారట. ఆ పాత్రను మహేశ్ కాదంటే జయం రవి చేశారు. మహేశ్ బాబు ఈ సినిమాలో నటించకుండా ఉండటమే మంచిది అయింది. టాప్ స్టార్ ఇమేజ్ కలిగిన నటుడు మహేశ్ బాబు. గుంపులో గోవిందలా ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ వేస్తే నిజంగానే అది మహేశ్ బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేసి ఉండేది అని మహేశ్ బాబు అభిమానులు అంటున్నారు.