Samantha : స‌మంత ఇన్ని కండీష‌న్స్ పెడుతుందా.. స‌డెన్‌గా ఈ మార్పుకి కార‌ణం ఏంటి?

Advertisement

Samantha : ఏ మాయ చేశావే చిత్రంతో అంద‌రి మ‌న‌స్సులు కొల్ల‌గొట్టిన అందాల ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌ల తెగ వార్త‌ల‌లో నిలుస్తుంది. స‌మంత మాట్లాడిన న్యూసే, మాట్లాడక‌పోయిన అది న్యూసే. స్టార్ హీరోల‌కి సమానంగా పాపులారిటీ సంపాదించుకున్న స‌మంత వెండితెర‌తో పాటు సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తుంది.ఆమెని వెండితెరపై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్ర‌స్తుతం ఆమె ఖాతాలో ప‌లు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సమంత ఇప్పటికే `మనం`లో రెండు పాత్రల్లో మెరిసింది. అలాగే తమిళంలో `10ఎండ్రాతుకుల్లా` చిత్రంలో డ్యుయెల్‌ రోల్‌ చేసి మెప్పించింది. ముచ్చటగా మూడోసారి ఆమె ద్విపాత్రాభినయం చేయబోతుందట. ఈ విష‌యం తెలిసి అంద‌రు అవాక్క‌వుతున్నారు. పవన్‌ కళ్యాణ్, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి టాప్‌ హీరోల సరసన నటిస్తూ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్నారు.

Advertisement

ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రాల్లోనూ నటిస్తున్న సమంత గ్లామర్‌ విషయంలో ముందు నుంచి పాజిటివ్‌ గానే ఉంటూ వస్తున్నారు. ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌లో ఇంకాస్త శృతిమించి నటించారు. పుష్ప సినిమాలోను పొట్టి బ‌ట్ట‌ల‌లో నానా ర‌చ్చ చేసింది. ఇక సోష‌ల్ మీడియాలోను ఈ అమ్మ‌డి ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో నానా ర‌చ్చ చేస్తూ కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉంది. అయితే స‌మంత ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా సైలెంట్ అయింది. సమంత తాజాగా అభిమానులకు షాక్‌ ఇచ్చే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Advertisement
Will Samantha put so many conditions
Will Samantha put so many conditions

Samantha : స‌మంత షాకింగ్ డెసిష‌న్..

ఇకపై కొత్త చిత్రాల్లో గ్లామరస్‌గా క‌నిపించ‌కుండా ఉండాల‌ని అనుకుంటుంద‌ట‌. అలాగే సామాజిక మాధ్యమాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు, టాక్‌. ఇకపై చిత్రాల్లో హీరోలతో అత్యంత సన్నిహితంగా ఉండే సన్నివేశాల్లో కూడా న‌టించ‌కూడద‌ని ఈ అమ్మ‌డు భావిస్తున్న‌ట్టుగా తెలుస్తుంది. హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలకే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంగా చెబుతున్నట్లు సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌న్న‌ది తెలియాల్సి ఉంది. ఇక నాలుగేళ్ళుగా ప్రేమించుకున్నస‌మంత‌, నాగ చైతన్య‌లు పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చ‌క్క‌టి జంట అని అంద‌రూ అనుకునేవారు. అయితే అంద‌రికీ వీరిద్ద‌రూ షాకిచ్చారు. ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు ఏంటో ఏమో కానీ.. విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వీరిద్ద‌రూ విడిపోయి దాదాపు ఏడాది కావ‌స్తుంది.

Advertisement