Trivikram : త్రివిక్రమ్ లేకపోతే.. “ఆయన” బ్రతుకు జీరో…

Advertisement

Trivikram : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట్లో కే విజయభాస్కర్ అనే దర్శకుడు తో సినిమాలు చేసేవాడు. ఆయన దగ్గరే కొన్నాళ్లు రచయితగా చేసిన త్రివిక్రమ్ ( Trivikram Srinivas)  కు మంచి గుర్తింపు లభించింది. ఇక అవకాశాల కోసం చూస్తున్న సమయంలో స్వయంవరం సినిమాతో మొదటిగా అవకాశం వచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత విజయభాస్కర్ త్రివిక్రమును అసలు వదలలేదు. త్రివిక్రమ్ వరుసగా రైటర్ ఛాన్స్ లను అందుకున్నారు. ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన “నువ్వే కావలి” సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన “నువ్వు నాకు నచ్చావ్” “మన్మధుడు” “మల్లీశ్వరి” సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పైసా వసూలు చేశాయి.

Advertisement

అప్పట్లో త్రివిక్రమ్ విజయభాస్కర్ కాంబినేషన్ అంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది.అలాగే వీరిద్దరి కాంబినేషన్లో నాగార్జున ( Nagarjuna)  , వెంకటేష్ ( Venkatesh) వరుస విజయాలు అందుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) కన్ను వీరిద్దరిపై పడింది. ఈ ఇద్దరితో కలిసి జై చిరంజీవ సినిమాను తీశారు మెగాస్టార్. కానీ ఆ సినిమా అంత సక్సెస్ కాకపోవడంతో వీరిద్దరి కలయికలో మళ్లీ సినిమా రాలేదు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా కంటే ముందే డైరెక్టర్ గా మారిపోయాడు కానీ మెగాస్టార్ కోరిక మేరకు జై చిరంజీవ లో రైటర్ గా వర్క్ చేశాడు. ఈ సినిమా తర్వాత విజయభాస్కర్ తో త్రివిక్రమ్ కలవలేదు.త్రివిక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత విజయ భాస్కర్ కు సరైనన విజయాలు దక్కలేదు.

Advertisement
Without Trivikram, He is zero
Without Trivikram, He is zero

ఆ తర్వాత చేసిన “క్లాస్ మెట్స్” మరియు “భలే దొంగలు” సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ తరువాత ఆది సాయికుమార్ తో “ప్రేమ కావాలి” సినిమా చేయగా అది హిట్టుగా నిలిచింది. ఆ సినిమా హిట్ అవడంతో విజయభాస్కర్ రామ్ పోతినేని , విక్టరీ వెంకటేష్ తో “మసాలా” సినిమా చేయగా అది డిజాస్టర్ అయ్యింది .మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ లేకుండా మరోసారి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ భాస్కర్. శ్రీ కమల్ అనే కొత్త కుర్రాడిని హీరో గా పరిచయం చేస్తూ జిలేబి మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు విజయభాస్కర్. దీనిలో హీరోయిన్ గా రాజశేఖర్ కూతురు శివాని నటించబోతుంది. అలాగే మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు .ఇటీవల ఈ సినిమా ఓపెనింగ్ జరుగగా దీనిలో త్రివిక్రమ్ ప్రత్యేక అతిథిగా పాల్గొని తన గురువు గారు సక్సెస్ అందుకోవాలని కోరుకున్నారు. ఇక జిలేబి సినిమాతో విజయభాస్కర్ సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

Advertisement