Youtube Shorts : యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ లో టైమ్ పాస్ కావడానికి వీడియోలు చూడొచ్చు. టైమ్ స్పెండ్ చేసి వీడియోలు తీసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. యూట్యూబ్ లో డబ్బులు సంపాదించేవాళ్లు ప్రస్తుతం చాలామంది ఉన్నారు. ట్రావెలింగ్, బ్యూటీ, ఫన్, ఎంటర్ టైన్ మెంట్.. ఇలా పలు కేటగిరీలలో వీడియోలు చేస్తూ వ్యూస్ పెంచుకుంటూ లక్షల మంది డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే.. టిక్ టాక్ ఇండియాలో బ్యాన్ అయిన తర్వాత షార్ట్ వీడియోస్ కు ఉన్న పాపులారిటీని గుర్తించిన యూట్యూబ్.. షార్ట్స్ ను తీసుకొచ్చింది. తక్కువ నిడివి ఉన్న వీడియోలను అప్ లోడ్ చేస్తే అదే షార్ట్స్ వీడియో అన్నమాట.
ఈ వీడియోలు నిమిషం కంటే కూడా తక్కువగా ఉంటాయి. ఇదివరకు టిక్ టాక్ లో షార్ట్ వీడియోస్ చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఫేస్ బుక్, ఇన్ స్టా కూడా షార్ట్ వీడియోస్ ఆప్షన్ ను తీసుకొచ్చింది. అదే రీల్స్. అయితే.. ఇప్పటి వరకు యూట్యూబ్ షార్ట్స్ వల్ల క్రియేటర్లకు వచ్చే ఆదాయం అయితే లేదు. అది కేవలం వ్యూస్ పెంచుకోవడం కోసమే. కానీ.. యూట్యూబ్ షార్ట్స్ బిజినెస్ ను పెంచుకోవడానికి యూట్యూబ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే యూట్యూబ్ షార్ట్స్ కు కూడా మానటైజేషన్ ఆప్షన్ ను తీసుకొస్తోంది. యూట్యూబ్ షార్ట్స్ మానెటైజేషన్ 2023 లో ప్రారంభం కానుంది.

Youtube Shorts : యూట్యూబ్ షార్ట్స్ మానెటైజన్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి?
షార్ట్స్ క్రియేటర్స్ కనీసం 10 మిలియన్ల వ్యూస్ కేవలం షార్ట్స్ వీడియోల ద్వారా 90 రోజుల్లో పొందగలిగితే వాళ్లు యూట్యూబ్ షార్ట్స్ మానెటైజేషన్ కు అప్లయి చేసుకోవచ్చు. షార్ట్స్ వీడియోలో వచ్చే యాడ్స్ మీద వచ్చే ఆదాయంలో 45 శాతం మాత్రమే క్రియేటర్స్ కు యూట్యూబ్ పంపిస్తుంది. ఓ 10 శాతం రెవెన్యూను మ్యూజిక్ లైసెన్స్ కోసం తీసుకుంటుంది. అంటే.. యూట్యూబ్ షార్ట్స్ కోసం యూట్యూబ్ నుంచి పలు లైసెన్స్ ఉన్న మ్యూజిక్ ను ఉచితంగా వాడుకోవచ్చు. 2007 లో యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ ను లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటి వరకు యూట్యూబ్ పలు క్రియేటర్లు, ఆర్టిస్టులు, మీడియా కంపెనీలకు 50 బిలియన్ డాలర్లను పే చేసింది. తాజాగా షార్ట్స్ కు కూడా మానెటైజేషన్ ప్రక్రియను త్వరలో ప్రారంభించనుంది.