Hair Tips : ప్రస్తుత కాలంలోని వాతావరణ పరిస్థితులు మరియు ఆహారపు అలవాట్ల వలన ప్రతి ఒక్కరికి తల వెంట్రుకలు వస్తున్నాయి. అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారికి కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో లభించే రకరకాల హెయిర్ కలర్స్ ను వినియోగిస్తున్నారు. దీని వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే 100 సంవత్సరాల క్రితం చిట్కాను ఉపయోగించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టును నల్లగా చేసుకోవచ్చు. అది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..దీనికోసం ముందుగా ఒక 50 గ్రాములు గోరింటాకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోరింటాకు తెల్ల జుట్టును తగ్గించడంలో బాగా పయోగపడుతుంది. అయితే చాలామంది మార్కెట్లో దొరికే హెన్నా పౌడర్ ను వినియోగిస్తారు దానికంటే గోరింటాకు వినియోగించడం మంచిది.
తర్వాత 50 గ్రాములు ఉసిరికాయలు తీసుకొని వాటిలోని గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి . ఉసిరికాయలు కూడా తెల్ల జుట్టును తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడంలో ఉసిరికాయ , సహాయపడుతుంది.తర్వాత 50 గ్రాముల కరక్కాయలను తీసుకొని పగలు కొట్టి గింజలను తీసేసి పైన ఉండే బెరడను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు కరక్కాయ బెరడును మరియు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీనిలో గోరింటాకును కూడా వేసి మెత్తగా పేస్టులా తయారు చేసుకోవాలి..

మిశ్రమం మొత్తాన్ని తీసుకొని ఒక కళాయిలో చదునుగా పరిచి ఒక రాత్రంతా మూత పెట్టి అలా ఉండనివ్వాలి. ఉదయం లేచిన తర్వాత మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని జుట్టు కుదురుల వరకు వెళ్లేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ఒక గంట వరకు అలా ఆరనివ్వాలి. దీన్ని పూర్తిగా గడ్డ కట్టేంతవరకు తలపై ఉంచకూడదు. కొంచెం తడిగా ఉన్నప్పుడే దీనిని మామూలు నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా నెలకు మూడుసార్లు చేయడం ద్వారా తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కాను వంద సంవత్సరాల క్రితం వారు ఉపయోగించేవారట.