Hair Tips : ఈ కాలంలో ప్రతి వయసు వారికి తల వెంట్రుకలు రావడం అయిపోయింది గా మారింది. తెల్ల జుట్టు అనేది వయసుగల వారికి వస్తే పర్లేదు కానీ చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు ఉన్నవారు నలుగురిలో తలెత్తుకొని తిరగాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికోసం అనేక రకాల హెయిర్ డ్రైస్ ను ఉపయోగిస్తున్నారు. దీని వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కాకుండా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో దొరికే వాటితో నాచురల్ గా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీనికోసం ముందుగా కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ఇనుప కడాయిని పెట్టుకుని దానిలో కరివేపాకును వేసి నూనె వేయకుండా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు నల్లగా అయ్యేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న కరివేపాకును మిక్సీలో వేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. పౌడర్ ను జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం జల్లెడ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి.అలాగే దానిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా అలోవెరా జెల్ ను వేసుకోవాలి. అలాగే దీనిలో ఒక చెంచా కొబ్బరి నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని తలస్నానం చేసిన తర్వాత జుట్టు కుదరలకు వెళ్లేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత దీనిని అలా గంటసేపు ఆరనివ్వాలి. మరి గట్టిగా ఆరిపోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే మంచినీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి ఒక సారి చేయడం వలన తెల్ల వెంట్రుకలు మొత్తం నల్లగా అయిపోతాయి. ఈ చిట్కాను వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి వారైనా యూస్ చేయవచ్చు. దీనిలో నాచురల్ వాటిని ఉపయోగించాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. ఈ సమస్యతో మీరు బాధపడుతున్నట్లయితే ఒకసారి ఈ చిట్కాను ట్రై చేసి చూడండి 100% రిజల్ట్ ను చూస్తారు.