Vidura Neeti : మహాభారతంలో అత్యంత తెలివైన వ్యక్తి ఎవరు అంటే మొదటిగా గుర్తు వచ్చే పేరు మహాత్మా విదురుడు. విదురుడుని శ్రీకృష్ణుడు అర్థం చేసుకోవడం వల్లనే పాండవులు మహాభారతం యుద్ధంలో గెలుపొందారు. మహాత్మ విధురుడి వివేకం తెలివితేటలు చాలా ఉన్నప్పటికీ గర్వం మాత్రం అస్సలు కనిపించదు. మహాత్మ విదురుడు మరియు మహారాజు ధృతరాష్ట్ర మధ్య జరిగిన చర్చలు మరియు సంభాషలను సంకలనాన్ని విదురుడి నీతి అంటారు. విధురుడి నీతి అనేది మన జీవితంలోని అన్నింటిని చర్చిస్తుంది. అలాగే మనుషులలో ఉండే చెడు అలవాట్ల గురించి కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఇక ఆ చెడు అలవాట్ల కారణంగా అతను తన జీవితమంతా సంపద, ఆనందం, శ్రేయస్సు, కోసం వెతుకుతుంటాడు అని చెప్పడం జరిగింది. విధురుడి నీతి ఆధారం గా ఎలాంటి అలవాట్లు ఉండకూడదు ఇప్పుడు చూద్దాం.
సోమరితనం : సోమరిపోతుల పైన మహాలక్ష్మి కటాక్షం ఉండదు అని విదురుడు చెప్పాడు. వీరికి తల్లి ఆశీస్సులు ఎప్పుడూ లభించవట. దీని కారణంగా ఈ వ్యక్తులు వారి జీవితం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారు ఎప్పుడూ అదృష్టం కోసం వేచి చూస్తూ తమ జీవితాన్ని గడిపేస్తుంటారని విదురుడు చెప్పాడు. అలాగే వీరి నాశనానికి కారణం వీరి సోమరితనమే అని ఇక దీన్ని పెద్ద శత్రువుగా పరిగణించాలి అని విదురుడు చెప్పాడు. సోమరిపోతులు తమ జీవితాన్ని డబ్బు లేకుండా జీవించవలసి ఉంటుంది.

కష్టపడేవారు : కష్టపడే వారికి విజయాలు ఎప్పుడూ వస్తాయని విదురుడు చెప్పాడు. ప్రతి మనిషి తన సొంత కష్టార్జితం వల్లే విజయాలను అందుకుంటాడని స్పష్టం చేశాడు విదురుడు. విదురుడు నీతి లో అన్నట్లుగా సమాజంలో డబ్బు ,పదవి, పలుకుబడి, పురోభివృద్ధి, ఎప్పుడూ, ఉద్యోగాలు, పొందాలని ప్రతి ఒక్క మనిషి ఆశ పడుతూ ఉంటాడు. ఎలాంటి కష్టం లేకుండా ఎవరు ఎప్పటికీ ఏమీ చేయలేరు అని చెప్పాడు. దేవుడిని నమ్మనివారు : దేవుడిని నమ్మని వారిపై దేవుని యొక్క కృప ఎప్పటికీ ఉండదని అతను జీవితం మొత్తం పేదరికంతోనే బ్రతకాల్సి ఉంటుందని విదురుడు చెప్పాడు