7th Pay Commission : మన దేశమంతా కలిసి ఎంతో సంబురంగా జరుపుకునే పండుగ దీపావళి. ఈ పండుగను అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ వేడుకలను జరుపుకుంటారు. ఈనేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీపావళి సందర్భంగా దీపావళి బోనస్ ను ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కేంద్రం దీపావళి బోనస్ ను ప్రకటించింది.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెరిగిన విషయం తెలిసిందే. డీఏ పెంపుతో పాటు దీపావళి బోనస్ కూడా వస్తుండటంతో ఉద్యోగుల సంతోషాలకు అవధులు లేకుండా పోయాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వం కూడా దీపావళి బోనస్ ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించాయి. 2017 రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం రాజస్థాన్ రాష్ట్ర ఉద్యోగులందరికీ మ్యాట్రిక్స్ లేవల్ 12 పే స్కేల్ ఉన్నవాళ్లకు దీపావళి బోనస్ ను ప్రకటించింది.

7th Pay Commission : రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.6774 అందనుంది
ప్రతి రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగి గరిష్ఠంగా రూ.6774 దీపావళి బోనస్ గా అందుకోనున్నారు. అందులో 75 శాతం డబ్బులు క్యాష్ గా ఇవ్వనున్నారు. అంటే అకౌంట్ లో వేస్తారు. మిగితా 25 శాతాన్ని జీపీఎఫ్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. రైల్వే ఉద్యోగులకు కూడా బోనస్ ఇచ్చేందుకు యూనియన్ కేబినేట్ ఆమోదం తెలిపింది. ట్రాక్ మెయిన్ టేనర్స్, డ్రైవర్స్, గార్డ్స్, స్టేషన్ మాస్టర్స్, సూపర్ వైజర్స్, టెక్నిషియన్స్, టెక్నిషియన్ హెల్పర్స్, కంట్రోలర్స్, పాయింట్స్ మెన్, మినిస్టీరియల్ స్టాఫ్, గ్రూప్ సీ స్టాప్ లాంటి ఉద్యోగులకు బోనస్ అందనుంది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని రైల్వే ఉద్యోగులకు అందించనున్నారు. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు బోనస్ అందిస్తారు. ఈ సంవత్సరం కూడా 78 రోజుల వేతనాన్ని 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు బోనస్ అందనుంది.