Mentikura Aalu Parotta : ఆలు పరాట మీరు తినే ఉంటారు ఒక్కసారి ఈ మెంతికూర ఆలు పరాటా చేసి తినండి మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది…

Advertisement

Mentikura Aalu Parotta : ఈరోజు మీకు నేను మెంతుకూర ఆలు పరాటా చేసి చూపించబోతున్నాను చాలా మెత్తగా చాలా టేస్టీగా అలాగే హెల్ది కూడా పిల్లలైనా పెద్దవాళ్లేనా అస్సలు మాట్లాడకుండా తినేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి అంత నచ్చుతుంది. వంట రాని వారు కూడా ఈ పరోటాని చాలా ఈజీగా చేసేస్తారు. అధిక బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఈ మెంతికూర ఆలు పరోటా ని సాయంత్రం వేళలో డిన్నర్ తీసుకోకుండా దీనిని తిన్నారంటే కచ్చితంగా మీరు అధిక బరువు తగ్గిపోతారు. దీనిని ఒకటీ తింటే చాలు కడుపు నిండిపోతుంది. ఇక ఆకలే ఉండదు.ఇప్పుడు ఈ మెంతికూర ఆలు పరోట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం…

Advertisement

దీనికి కావాల్సిన పదార్థాలు: గోధుమపిండి, ఉప్పు, మెంతికూర, ఆలుగడ్డలు, ఆయిల్, పచ్చిమిర్చి కొత్తిమీర, జీలకర్ర, కారం, పసుపు, నిమ్మరసం, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యప్పిండి, మొదలైనవి… ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసి మెంతికూర ఒక కప్పు వేసి కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ బాగా కలుపుకొని దానిపైన తడి క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి స్టప్ కోసం ఆలుగడ్డలను తీసుకొని వాటిని ఉడికించి గ్రేడర్ సహాయంతో స్మాష్ చేసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి.

Advertisement
Aalu Paratha You will eat once you make this Mentikura Aalu Parotta and you will want to eat it again and again
Aalu Paratha You will eat once you make this Mentikura Aalu Parotta and you will want to eat it again and again

తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమపిండి మిశ్రమం తీసుకొని దాన్నుంచి పరోట ఏ ఏ సైజులో చేసుకుంటారు. అదే సైజులు పిండి ముద్దని తీసుకొని కొంచెం పొడి పిండి వేసి పరోటాల వొత్తుకోవాలి. ఆ వత్తుకున్న పరోటాల్లోకి ఆలుగడ్డ స్టప్ ని ట్రయాంగిల్ షేపులో పెట్టి పరోటాన్ని కూడా ట్రయాంగిల్ షేపులో మలుచుకుని దాని చివర్లు కూడా క్లోజ్ చేసుకుని మళ్లీ కొంచెం పొడి పిండి వేసి కర్రతో రుద్దుకోవాలి. స్టవ్ పై ఒక పాన్ పెట్టి దానిపైన కొంచెం నెయ్యి వేసి పరోటా ని వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. అంతే మెంతికూర ఆలు పరోట రెడీ. ఇలా తీసుకున్న పరోటాలను తీసుకోవచ్చు. లేదా ఉత్తిగా కూడా తీసుకోవచ్చు. దీనిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు. దీని టేస్ట్ అంత బావుంటుంది.

Advertisement