Bandar Halwa Recipe : నోరూరించే బందర్ హల్వా ఇలా చేసారంటే.. మళ్ళీ మళ్ళీ చేస్తారు…!

Advertisement

Bandar Halwa Recipe : తీపి వంటకాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇంట్లో ఎటువంటి శుభకార్యమైన మొదటిగా స్వీట్ ను తింటారు. సంతోషకరమైన విషయాలను స్వీట్ ఇచ్చి తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. అంతలా అందరికీ స్వీట్స్ అంటే ఇష్టం. మన ఇంట్లో ఏదైనా పండగ అయితే ముందుగా స్వీట్స్ నే చేసుకుంటారు. అందులో బందరు హల్వా చేసుకునే తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. బందరు హల్వాను సరైన కొలతలతో చేస్తే పక్కాగా వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం బందరు హల్వా ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1) గోధుమపిండి 2) పంచదార 3) నెయ్యి 4) జీడిపప్పు 5)యాలకుల పొడి

Advertisement

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమపిండి వేసుకోవాలి. గోధుమ పిండి కాకపోయినా మైదాపిండితో కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గోధుమ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి మీద మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత పిండిని నలుపుతూ పాలలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమపిండి పాలను ఒక గిన్నెలోకి వడకట్టుకోవాలి. మిగిలిన పిండిని మరో గిన్నెలో వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి నలుపుతూ ఉంటే గోధుమపాలు వస్తాయి. ఈ పాలను కూడా అందులోకి వడకట్టుకోవాలి. మిగిలిన పిండిని పడేయాలి. ఇప్పుడు ఈ పాలపై మూత పెట్టి ఒక గంట పాటు ఉండనివ్వాలి.

Advertisement
Bandar Halwa Recipe In Telugu
Bandar Halwa Recipe In Telugu

ఒక గంట సేపు అలా ఉంచితే అడుగు భాగంలో చిక్కటి పాలు పేరుకుంటాయి. పైన పేర్కొన్న పల్చటి నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన గోధుమ పాలన పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఒకటి ముప్పావు కప్పు పంచదార వేసి, ముప్పావు కప్పు నీళ్లు పోసి పంచదారను కరగనివ్వాలి. ఇప్పుడు వేరే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో అరకప్పు పంచదార వేసి కలుపుతూ ఉండాలి. ఇంతలో పంచదార కరుగుతుంది ఇప్పుడు అందులో గోధుమ పాలను పోసి ఉడికించుకోవాలి. గోధుమపాలు చిక్క పడేంతవరకు ఉంచి ఇప్పుడు ఇందులో మరొక కడాయిలో వేసుకున్న పంచదార క్యారమెల్ ను వేసి బాగా కలపాలి. మంటను లో ఫ్లేమ్ లో ఉంచి ముప్పావు కప్పు నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. 20 నిమిషాల దాకా కలుపుతూ హల్వా ప్యాన్ కి అంటుకోనప్పుడు కొద్దిగా యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు పలుకులు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన బందర్ హల్వా రెడీ.

Advertisement