Prawns Dum Biryani : ఈరోజు స్పెషల్ హైదరాబాది స్పెషల్ ఫ్రాన్స్ దమ్ బిర్యాని.. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రాన్స్ బిర్యానీ చికెన్, మటన్ బిర్యానీ అంతా ఫేమస్ అవ్వకపోయినా టేస్ట్ మాత్రం ఆ రెండిటికి సమానంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఈ ఫ్రాన్స్ బిర్యానీ రెడీ చేయడానికి మటన్, చికెన్ బిర్యానీ అంత టైం తీసుకోదు.. చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.. చాలా బాగుంటుంది.
ఇక దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి రొయ్యలు, యాలకులు, నలయాలకు, లవంగాలు, షాజీరా, దాల్చిన చెక్క, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, వేయించిన బ్రౌన్ ఆనియన్, నెయ్యి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె ,నిమ్మకాయ రసం, ఉప్పు ,రైస్, పెరుగు, కుంకుమపువ్వు నీళ్లు, గులాబీ రేకులు, మొదలైనవి…
దీని తయారీ విధానం: ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, నాలుగు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒకటి దాల్చిన చెక్క, వేయించిన జీలకర్ర పొడి ,కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం నిమ్మరసం, నల్ల యాలుక , ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ,కొంచెం పసుపు,ఒకటి, ఇలా మసాలాలు అన్ని వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలిపి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పై రెండు లీటర్ల నీటిని పెట్టి దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, ఒక రెండు స్పూన్ల గులాబీ రేకులు, నాలుగు లవంగాలు, నాలుగు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, కొంచెం పసుపు, కొంచెం నెయ్యి, కొంచెం ఉప్పు వేసి బాగా మసల కాగనివ్వాలి.

ఇలా మసల కాగిన వాటర్ లో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 80% ఉడికిచ్చుకోవాలి. ఇలా ఉడికిన రైస్ని తీసి ముందుగా నానబెట్టుకున్న రొయ్యల మిశ్రమంలో లేయర్ లేయర్ గా వేసుకుంటూ దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం బ్రౌన్ ఆనియన్, కొంచెం నెయ్యి, కుంకుమపువ్వు నీళ్ళని వేసి మూత పెట్టి దాని సైడ్ లని పిండితో క్లోజ్ చేసుకుని 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికించి.. ఏడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే హైదరాబాది ఫ్రాన్స్ దమ్ బిర్యాని రెడీ అవుతుంది. ఎంతో సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకొని తినవచ్చు. దీన్ని చూసి మాత్రం అమోఘంగా ఉంటుంది.