Badusha : స్వీట్స్ అంటే అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇక వాటిలో బాదుషా అంటే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. అంత బాగుంటుంది బాదుషా. అటువంటి బాదుషా అని ఇప్పుడు మనం ఇంట్లోనే చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా నాకు ఎలా వచ్చాయో మీకు కూడా అదే విధంగా వస్తాయి. పైన కాస్త క్రిస్పీగా లోపల సిరప్ ని పీల్చుకొని ఎంత జ్యూసీగా ఉంటాయో సేమ్ ఇదేవిధంగా నేను చెప్పినట్లు ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి. మరి ఎలా తయారు చేయాలో చూసేయండి. దీనికి కావలసిన పదార్థాలు: మైదాపిండి, , ఆయిల్ పంచదార ,కుంకుమపువ్వు ,యాలకుల పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్, నెయ్యి, నీళ్లు, మొదలైనవి…
తయారీ విధానం: ముందుగా రెండు కప్పుల మైదాని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, ఒక స్పూను బేకింగ్ పౌడర్ దానిలో అరకప్పు నెయ్యి వేసి దానిని బాగా కలుపుకొని తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా పది నిమిషాల వరకు కలుపుకోవాలి. సాఫ్ట్ గా వచ్చేవరకు పిండి బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ గా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని.. తర్వాత స్టవ్ పై ఒక పాన్ పెట్టి దానిలో రెండు కప్పుల చక్కెరను వేసి హాఫ్ కప్పు వాటర్ ని వేసుకొని దానిలో కొంచెం కుంకుమపువ్వు కూడా వేసి తీగ పాకం వచ్చేవరకు ఉంచుకోవాలి. ఈ విధంగా లైట్ తీగ పాకం రావాలి ఆలా పాకం వస్తే కరెక్ట్గా వచ్చినట్లు ఇలా వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆప్ చేసేసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్యాన్ కి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి.

తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఉండలుగా చేసి బొటనవేలుతో మధ్యలో హోల్ లాగా పెట్టి వాటిని పక్కన పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత అన్ని కడాయిలో వేసుకోవాలి.తర్వాత మంచి కలర్ వచ్చేస్తాయి. బాదుషా కూడా బాగా వేగదు లోపల పచ్చిపుచ్చిగా ఉంటాయి. అందుకని లైట్ గా వేడి ఎక్కిన తర్వాత అన్ని బాదుషాల్ని వేసుకొని ఈ బాదుషాలన్నీ పైకి తేలుతాయండి. కొద్దిసేపటికి మీకు పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి.
వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాలండి సరిగా వేగలేదు అంటే లోపల పచ్చి పచ్చిగా అస్సలు బాగుండవు ఇప్పుడు ఇలా ఆయిల్లో నుంచి పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత అన్ని తీసి చక్కెర పాకంలో వేసేసి చక్రపాకాన్ని ఈ బాదుషాకి బాగా పట్టేటట్టు గరిటితోటి పాకాన్ని ఇలా తీసి పైన కూడా వేస్తూ అటు ఇటు కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఉంచండి బాద్షాలు ఇప్పుడు రెండు లేదా మూడు నిమిషాల తర్వాత ఈ పాకంలో నుంచి బాదుషాలు అన్నిటిని తీసుకొని ఏదైనా ప్లేట్ లో వేసుకోండి. మీకు లైట్గా ఆరిన తర్వాత పైన డ్రై గా ఉన్నట్టు లోపల బాగా జ్యూసీగా ఉంటాయి. చాలా బాగుంటాయి.