Wedding style aloo curry : మనం ఒక్కొక్కసారి వెడ్డింగ్ లకి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల కర్రీస్ ను తింటూ ఉంటాం కానీ ఆ ఫ్లేవర్ వేరే విధంగా ఉంటుంది అందుట్లో ఒకటి ఆలు కర్రీ ఆలు కర్రీ ఫ్లేవర్ సూపర్ గా ఉంటుంది. అలాంటి పెళ్లిళ్లు స్పెషల్ ఆలు కర్రీ రెసిపీ దానిలో కొన్ని పదార్థాలు యాడ్ చేయడం వల్ల అంత టేస్ట్ వస్తుంది. ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో ఆరోమాటిక్ గా ఉంటుంది. బ్యాచులర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాంటి ఆలు కర్రీని ఇప్పుడు అదే టేస్టుతో ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం..దీనికి కావలసిన పదార్థాలు : ఆలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి బఠాణి, జీడిపప్పు, దాల్చిన చెక్క లవంగాలు, టమాటాలు, ధనియా పౌడర్, కారం, ఉప్పు, మటన్ మసాలా, ఆయిల్ ,అల్లం పేస్ట్, సోంపు మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకుని దానిలో ఐదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో ఒక స్పూన్ సోంపు, నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు, రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి వేయించుకొని దానిలో ఒక పది జీడిపప్పులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో ఒక కప్పు టమాట ముక్కలను కూడా వేసి బాగా మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికి ఆయిల్ పైకి వచ్చేవరకు ఉంచితేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్ ది వేయాలి.

తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ ని వేసి బాగా కలుపుకున్న తర్వాత దానిలో పచ్చి బఠాణి వెయ్యాలి వేసి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకుని ముక్కలుగా కట్ చేసుకున్న ఆలూ ని దానిలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చివర్లో కొంచెం కొత్తిమీర జల్లి ఐదు నిమిషాల పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆపి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా వెడ్డింగ్ స్టైల్ ఆలు కర్రీ రెడీ. ఇదేవిధంగా కచ్చితంగా చేసుకుంటే వెడ్డింగ్ స్టైల్ లో టెస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అదేవిధంగా చేసుకొని తింటారు. అంతా బాగుంటుంది. దీనిని బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.