Karivepaku Pachadi : కరివేపాకు నిలువ పచ్చడి ఈ విధంగా కొలతలు తో చేసుకోండి ఎవ్వరు చేసిన పర్ఫెక్ట్ గా వస్తుంది…

Advertisement

Karivepaku Pachadi : ఈరోజు మీకు నేను కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను.. ఈ కరివేపాకు నిల్వ పచ్చడి కొత్తవారు కూడా ఎంతో ఈజీగా ఫర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే పక్క కొలతలతో చూపించబోతున్నాం.. కాబట్టి ఎవ్వరైనా సరే పర్ఫెక్ట్ గా చేసేస్తారు. అలాంటి కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు:కరివేపాకు, , ఉప్పు, ధనియాలు, మెంతులు, శనగపప్పు మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఏండి మిరపకాయలు, చింతపండు, ఎల్లిపాయలు, బెల్లం మొదలైనవి… దీని తయారీ విధానం:ముందుగా కరివేపాకును తీసి శుభ్రంగా కడిగి నీడలో ఒక బట్టపై ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్న కరివేపాకుని తడి లేకుండా చూసుకోవాలి.

Advertisement

తర్వాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకుని దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా ఒక స్పూను మెంతులు, ఒక స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత మినప్పప్పు కొంచెం, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి ఎర్రగా వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక పది ఎండు మిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని తీసుకొని దాన్లో వేసి లో ఫ్లేమ్ లో క్రిస్పీగా వేయించుకోవాలి. తర్వాత దానిలోకి చింతపండుని, ఎల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి.అలా ఏగిన కరివేపాకును తీసి కొద్దిసేపు చల్లారిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్న తర్వాత ఈ కరివేపాకుని మిరపకాయల్ని కలిపి వేసి కొంచెం కొంచెంగా వేస్తూ మిక్సీ పట్టుకోవాలి.

Advertisement
Make the curry paste with measurements like this and it will come out perfect.
Make the curry paste with measurements like this and it will come out perfect.

అలా పట్టుకున్న తర్వాత మళ్లీ కొంచెం వేసి ఒక కప్పు ఆయిల్ వేసుకొని ముద్దలా పట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం ఎల్లిపాయలు వేసి బాగా ఎర్రగా అయిన తర్వాత ఈ కరివేపాకు మిశ్రమాన్ని వేసి ఒక ఐదు నిమిషాలు పాటు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే కరివేపాకు నిల్వ పచ్చడి రెడీ ఈ పచ్చడిని కళాయిలో నుంచి తీసి కొద్దిసేపు చల్లారిన తర్వాత గాజు సీసాలోకి నిలువ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న నిలువ పచ్చడి 15 ,20 రోజులు వరకు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి కలిపి తింటుంటే ఇక స్వర్గమే కనపడుతుంది అంత టేస్టీగా ఉంటుంది.

Advertisement