Kajjikayalu Recipe : స్వీట్ షాప్ లలో కజ్జికాయలు ఎంతో టేస్టీగా ఉంటాయి. అయితే కజ్జికాయలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అయితే అంత పెద్ద ప్రాసెస్ లో కాకుండా చాలా సింపుల్ గా టేస్టీగా కజ్జి కాయలను ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. కజ్జికాయలను ఈ పద్ధతిలో చేశారంటే క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం సరికొత్త పద్ధతిలో కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.కావలసిన పదార్థాలు: 1) మైదాపిండి 2) కార్న్ ఫ్లోర్ 3) డ్రై ఫ్రూట్స్ 4) ఎండు కొబ్బరి 5) పంచదార 6) గసగసాలు 7)యాలకుల పొడి 8)బొంబాయి రవ్వ ,
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు మైదాపిండి, వన్ టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కాకుండా మీడియం లో చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు మిక్సి లో ముప్పావు కప్పు పంచదార వేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక కప్పు సన్నగా తరిగిన ఎండు కొబ్బరి, పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఐదు నిమిషాలు దోరగా వేయించుకోవాలి.

స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న పంచదార పౌడర్, వన్ టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని రెండు నిమిషాలు కలిపి నాలుగు ఉండలుగా చేసుకోవాలి. మైదా పిండిని అద్దుతూ చపాతి అప్పలాగ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక అప్ప తీసుకొని దానిపై కార్న్ ఫ్లోర్ పేస్టును పలచగా రాయాలి. దీనిపై ఒక రోటీని పెట్టి కార్న్ ఫ్లోర్ పేస్ట్ రాసి ఇలా నాలుగు రోటీలను ఒకదానిపై ఒకటి పెట్టుకొని పైన మైదాపిండి రాసి రోల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముక్కను తీసుకొని మైదాపిండితో అప్పలాగా చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ ని పెట్టి కజ్జికాయలు షేప్ లో రోల్ చేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి కజ్జికాయలను ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అయిన స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయలు రెడీ అయిపోయాయి.