Sajja Burelu Recipe : ఈరోజు మీకు సజ్జ బూరెలు చేసి చూపిస్తాను. ఇది పాతకాలం నాటి వంట. అప్పట్లో ఈ సజ్జలను అన్నంగా వండుకొని తినేవాళ్ళట. ఈ సజ్జలలో అంత ఐరన్ క్వాంటిటీ ఉంటుంది. కానీ ఇప్పుడు అలా అన్నం వండుకొని తినలేము కాబట్టి ఈ విధంగా సజ్జ బూరెలను చేసుకొని తినవచ్చు. ఈ సజ్జ బూరెలు బాగా పొంగుతూ వచ్చి.. మంచి టేస్టీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి కొత్తగా చేసుకునే వాళ్ళయినా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్ గా చేసుకుంటారు ఇవి 10 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా ఈ సజ్జ బూరెల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
దీనికి కావాల్సిన పదార్థాలు: సజ్జలు, బెల్లం, యాలకులు ఆయిల్, కొబ్బరి, ఉప్పు మొదలైనవి… దీని తయారీ విధానం: ముందుగా ఒక కేజీ సజ్జలు తీసుకుని వాటిని శుభ్రం చేసుకుని వాటిని నైట్ అంతా నానబెట్టి మళ్లీ మరుసటి రోజు వాటిని కడిగేసి ఎండకి ఆరబెట్టుకోవాలి. తర్వాత వాటిని తీసి మిక్సీజార్లో వేసుకొని మెత్తటి పిండిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి యాలకులని కూడా మిక్సీ వేసుకొని ఆ పిండిలో కలుపుకోవాలి.తర్వాత బెల్లం మెత్తగా తురుముకొని దానిని కూడా స్టవ్ పై పెట్టి పాకం పట్టవలసిన అవసరం లేదు వేడి చేసి తీసుకొని ఆ బెల్లం నీళ్ళని ఒక గంటతో వడకట్టుకుంటూ ఆ పిండిలో పోసి ఆ పిండిని మొత్తం కలుపుకోవాలి.

ఇంకా నీళ్లు అవసరమైతే నీళ్లను కూడా వేసుకుంటూ బాగా చపాతి పిండిలా కలుపుకోవాలి. తర్వాత ఒక తడి బట్టని తీసుకొని ఒక పీటపై పరిచి ఈ ముద్దలని తీసుకొని కొంచెం కొంచెం గా చేసుకొని అరిసెల ఒత్తుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ని పోసుకొని ఈ ముందుగా ఒత్తి పెట్టుకున్న సజ్జ బూరెలను రెండు మూడు వేస్తూ వేయించుకోవాలి. ఇలాగే ప్రతిసారి రెండు మూడు వేస్తూ వేయించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా సజ్జ బూరెలు రెడీ.ఇలా సజ్జలను నానబెట్టి సజ్జ బూరెలు చేస్తే చాలా బాగా పొంగుతాయి అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఈ 15 రోజులు పాటు నిల్వ ఉంటాయి.