Venna Undalu : చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు స్వీట్స్ ని ఇష్టపడతారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా స్వీట్స్ ను ఇంట్లో చేసుకోలేకపోతున్నారు. స్వీట్స్ తినాలి అనిపిస్తే స్వీట్ షాప్ లోకి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే మన పూర్వీకులు చేసిన స్వీట్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేసేవి. అందులో వెన్న వుండలు ఎంతో రుచిగా ఉండేవి. ఇప్పుడు ఈ వెన్న ఉండలను ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) 2) బియ్యం 3) నెయ్యి 4) ఉప్పు 5) బెల్లం 6) ఆయిల్ 7)యాలకులపొడి 8) పచ్చి పాలు
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఈ బియ్యం నీళ్లను ఒప్పుకొని బియ్యాన్ని ఒక మెత్తటి క్లాత్ పై ఆరనివ్వాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా ఉప్పు, పావు కప్పు వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి పాలను వేసుకొని కొంచెం కొంచెం కలుపుతూ ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి అయ్యాక వెన్న ఉండలు వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాకం కోసం ఒక గిన్నెలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం, మూడు టేబుల్స్ స్ఫూన్ల నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత ఒక పాన్ లో వడకట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉండపాకం వచ్చేవరకు కలుపుతూ ఉండాలి. పాకం చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం యాలకుల పొడి కలుపుకోవాలి. వేయించి పెట్టుకున్న వెన్న ఉండలని వేసి కలపాలి. ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేలా వీటిని కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వెన్న ఉండలు రెడీ అయినట్లే.