Bellam Ariselu : ఈ టిప్స్, ట్రిక్స్ తో ఎవరైనా ఈజీగా అరిసెలు చేసేయొచ్చు.. చెడిపోయే ఛాన్సే ఉండదు…

Advertisement

Bellam Ariselu : ఈరోజు రెసిపీ వచ్చేసి పండుగ స్పెషల్గా బెల్లం అరిసెల్ని ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్లకు కూడా పర్ఫెక్ట్ గా వచ్చేలా ఎన్నో టిప్స్, అండ్ ట్రిక్స్ తో ఈ నేను చూపిస్తాను.. కంప్లీట్ గా చూసి మీరు కూడా ఇంట్లో డెఫినెట్ గా ట్రై చేయండి. అస్సలు ఫెయిల్ అవ్వకుండా అరిసెలు పర్ఫెక్ట్ గా చేసేస్తారు. ఈ అరిసెలు ఈజీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, యాలకుల పొడి, బెల్లం, నువ్వులు, నెయ్యి ,నూనె మొదలైనవి… ముందుగా ఒక కేజీ బియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక నాలుగు ఐదు సార్లు కడిగి ఒక చిల్లుల గిన్నెలో వడేసి ఉంచుకోవాలి.

Advertisement

తర్వాత దీనిని మిక్సీ జార్ లోనైనా పట్టుకోవచ్చు. లేదా మిల్లు కైనా ఇవ్వొచ్చు. అలా ఇచ్చిన పిండిని తెచ్చుకొని దానిని జల్లెడతో మంచిగా జల్లించుకొని దానిని చేతితో బాగా నొక్కుతూ పైన ఒక క్లాత్ కప్పి పక్కన ఉంచుకోవాలి. తర్వాత కేజీ బెల్లాన్ని తీసుకొని ముందుగా తురిమి స్టవ్ పైన పెట్టి కొంచెం వేడి అయిన తర్వాత దానిని వడకట్టి మళ్లీ స్టవ్ పైన పెట్టి బాగా కలుపుతూ ఒక బౌల్లో నీళ్లు వేసి ఆ నీళ్లలో పాకం తీసుకొని వేస్తూ అది మనం చేతిలో వేసుకొని నలుపుతుంటే ఉండలా రావాలి. అలా వచ్చిన తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్ల నెయ్యి కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకున్న తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ..

Advertisement
With these tips and tricks anyone can easily make mirrors with no chance of damage...
With these tips and tricks anyone can easily make mirrors with no chance of damage…

బాగా కలుపుకోవాలి అలా కొంచెం వేసి కలిపిన తరువాత స్టవ్ ఆపి దాన్ని గిన్నెని కింది దింపుకొని కొద్ది కొద్దిగా పిండి అంతా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం లూస్ గానే ఉండాలి. పిండి ఎక్కువ అవ్వకుండా మెత్తగా పల్చగా ఉండే లాగానే వేసి కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే అరిసెలు మెత్తగా వస్తాయి. లేకపోతే గట్టిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కలుపుకున్న తర్వాత దానిపైన కొంచెం నూనెను వేసి మూతని పెట్టి.. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఈ పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసుకొని ఆ వుండల్ని ఒక ఆయిల్ ప్యాకెట్ ని రెండు వైపులా కట్ చేసుకుని దానిమీద మందంగా కాకుండా పల్చ కాకుండా మీడియంగా కలుపుకోవాలి.

ఈ విధంగా అరిసెల ఒత్తుకొని ఆ హీటెక్కిన ఆయిల్లో ఒక్కటి మాత్రమే వేసుకుంటూ రెండు వైపులా టర్న్ చేసుకుంటూ.. కాల్చుకొని తీసుకోని అరిసెలను అరిసెలపీఠ మీద వేసి ఒత్తి తీసుకోవాలి. ఇదేవిధంగా ఒక్కొక్క అరిసె వేసుకుంటూ కాల్చుకొని తీసుకుంటే ఫర్ఫెక్ట్ గా వస్తాయి. ఇలా చేసుకోవచ్చు. నువ్వుల అరిసెలు చేసుకోవాలంటే డైరెక్ట్ గా పిండిలో వేసుకోవచ్చు. లేదంటే పిండి ముద్దను నువ్వుల్లో అది అరిసెల్లా చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా మేము చెప్పిన విధంగా చేసుకుంటే ఖచ్చితంగా అరిసెలు ఫర్ఫెక్ట్ గా మెత్తగా వస్తాయి…

Advertisement