Pain Relief : ప్రస్తుతపు ఆహారపు అలవాట్లు మరియు జీవన విధానం వలన ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. అయితే వాటిలో నడుము నొప్పి,మోకాళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, వస్తున్నాయి. ఇక వీటిని తగ్గించుకోవడం కోసం హాస్పిటల్లో చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎన్నో రకాల మందులు వినియోగించిన సరే తగిన ప్రయోజనం మాత్రం దక్కడం లేదు . అయితే ఇంట్లో దొరికే పదార్థాలతో ,న్యాచురల్ గా ఈ చిట్కాను చేసుకోవడం వలన కొంతవరకు ఉపశమనం పొందవచ్చు అని తెలుస్తుంది . ఇక వివరాలోకేళ్తే…
దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో రెండు చెంచాల అవిస గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక చెంచా మెంతులు వేసుకోవాలి. అవిస గింజలు ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ కలిగి ఉంటాయి. ఇది నడుము నొప్పి, మెడ నొప్పి , కాళ్ళ నొప్పులు మరియు అనేక రకాల నొప్పులు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెంతులు ఆంటీ ఆక్సిడెంట్ ను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో రెండు చెంచాల ఉసిరికాయ పొడిని వేసుకొని కలుపుకోవాలి.

ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దీనిలో గ్రామ్ కలా గొంధ్ వేసి అది కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇక గ్లాస్ లో వేసిన గొంతు కరిగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న పౌడర్ ను వేసుకోవాలి. ఈ రెండిటిని బాగా కలుపుకొని రోజు ఉదయం అన్నం తినక ముందే తీసుకోవాలి. ఇలా వరుసగా కొన్ని రోజులు చేయడం వలన శరీరంలో ఉండే అన్ని రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇక దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడాా ఉండవు