Hair Tips : నేటి సమాజంలో ,ఎలాంటి వయసు వారికైనా తెల్ల జుట్టు ,వస్తుంది.దానికి గల కారణం పొల్యూషన్ మరియు జుట్టు పైన శ్రద్ధ చూపించకపోవడం. ఈ తెల్ల జుట్టుతో బయట నలుగురితో తిరగాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పాలి. వీటిని తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ ను వాడుతుంటారు. తద్వారా దానిలో ఉండే కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్ కు గురి అవుతున్నారు. ఏ ప్రొడక్ట్స్ వాడిన తెల్ల వెంట్రుకలు శాశ్వతంగా మాత్రం పోవు. అయితే కెమికల్స్ లేకుండా నాచురల్ గా తయారు చేసుకున్న వాటిని ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడకుండా ఉండవచ్చు. అయితే ఇప్పుడు అదేంటో మనం తెలుసుకుందాం.
అయితే దీని కోసం ముందుగా కళాయి తీసుకొని దీనిలో రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని మూడు చెంచాల టీ పొడి వేసుకొని డికాషన్ లాగా మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు హెన్నా పౌడర్ ను తీసుకోవాలి. తర్వాత ఈ హెన్నా పౌడర్ లో కొంచెం కొంచెంగా డికాషన్ పోస్తూ ఉండలు మాదిరి లేకుండా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక రాత్రంతా లేదా రెండు మూడు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తద్వారా ఇది బ్లాక్ కలర్ లోకి మారుతుంది. ఇక దీనిని తెల్ల జుట్టు ఎక్కువగా ఉన్నచోట అప్లై చేసుకుని ఒక గంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత నీటితో కడుక్కోవాలి.

దీని తర్వాత మరొక ప్యాక్ ను రెడీ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది . దీనికోసం ముందుగా కళాయి తీసుకుని దానిలో ఒక కప్పు ఇండిగో పౌడర్ వేసుకోవాలి. తర్వాత దీనిలో గోరువెచ్చని నీళ్లు పోస్తూ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక రెండు గంటల తర్వాత దీన్ని బాగా కలిపి జుట్టుపై అప్లై చేసుకుని ఒక గంట సేపు తలపై అలా ఉండనివ్వాలి. ఇక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఈ రెండు ప్యాక్లను ఒకేరోజు వెంట వెంటనే చేసుకోవాలి. ఇలా చేయడం వలన కొద్ది రోజుల్లోనే తెల్ల వెంట్రుకలు నల్లగా మారడాన్ని మీరు గమనిస్తారు.