Hair Tips : బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… అయితే ఒకసారి ఈ నూనెను ట్రై చేయండి

Advertisement

Hair Tips :  ప్రస్తుత కాలంలో వాతావరణ పరిస్థితుల వల్ల , పొల్యూషన్ వల్ల, జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది. అలాగే చిన్న వయసులోనే బట్ట తల రావడం ,జుట్టు ఊడిపోవడం, వంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తున్నారు. ఆ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో దొరికే వాటితో ఇలా చేసినట్లయితే బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది. అలాగే జుట్టు రాలడం తగ్గించి, జుట్టు ఒత్తుగా తయారవుతుంది. ఆది ఎలాగో ఇప్పుడూ మనం తెలుసుకుందాం.

Advertisement

అయితే దీనికోసం ముందుగా బాగా ఎండ పెట్టిన మెంతులను తీసుకొని ,మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇలా వచ్చిన పొడిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని దానిలో మూడు చెంచాల మెంతు పిండి ని వేసుకోవాలి . మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది జుట్టు కుదుళ్లకు బలం చేకూర్చి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే దీనిలో ,స్వచ్ఛమైన కొబ్బరినూనెను వేసుకోవాలి తర్వాత దీనిలో మూడు చెంచాలల ఆముదం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆముదం జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది.

Advertisement
Are you suffering from baldness... try this oil once
Are you suffering from baldness… try this oil once

ఈ మూడింటికి బాగా కలిపి డబల్ బాయిలర్ పద్ధతిలో ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనెను చల్లార్చుకోవాలి. చల్లార్చిన నూనెను ఒక సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇక దీన్ని తల స్నానానికి ఒకరోజు ముందు రాత్రి అప్లై చేసుకుని ఉదయాన్నేే తలస్నానం చేయాలి. నూనె ను అప్లై చేసినప్పుడు ఐదు నుంచి పది నిమిషాలు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. దీనివలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఇక దీనిలో వాడిన పదార్థాలన్నీ నాచురల్ కాబట్టి దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.

Advertisement