Health Tips : ప్రతి ఒక్కరికి తాము అందంగా కనిపించాలని ఆశ ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైనా పండుగలకి లేదా ఏదైనా శుభకార్యాలలో తాము అందంగా కనిపించాలని భావిస్తారు. దానికోసం పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తుంటారు. ఇలా చేయడం వలన డబ్బు మరియు సమయం వృధా అవ్వడంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. వాటిలోని కెమికల్స్ ,మన మొహాన్ని మరింత కాంతి హీనంగా చేస్తున్నాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో దొరికే వాటితో ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ ని తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్టులా తయారైన మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసుకొని దానిలోని జ్యూస్ ను వడకట్టుకోవాలి . ఇలా వడకట్టుకున్న జ్యూస్ ను ఒక గిన్నెలో పోసుకుని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దానిలో బియ్యప్పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ బాగా కలుపుకోవాలి. పేస్ట్ లా కాకుండా డ్రైగా అయ్యేంతవరకు పిండిని వేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని 24 గంటలపాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిని ఏదైనా గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు . ఇక ఈ ప్యాక్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఒక బౌల్ ని తీసుకుని దానిలో సరిపడినంత ఈ పిండిని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా రోజు వాటర్ ను వేసుకోవాలి. రోజ్ వాటర్ మనకు మార్కెట్లో లభిస్తుంది. ఆ తర్వాత దీనిలో కొద్దిగా అలోవెరా జెల్ ని కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆడవారైతే ఇందులో కొంచెం కస్తూరి పసుపును కూడా కలుపుకుంటే మంచిది. కస్తూరి పసుపు దొరక్కపోతే కొమ్ములు పసుపును వేసుకోవాలి. ప్యాకెట్ పసుపును మాత్రం అస్సలు వాడకూడదు. వీటిని బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఐదు నుండి పదినిమిషాలుు మృదువుగా మసాజ్ చేసి నీటితో కడుక్కోవాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వలన మీ మొఖం మరింత అందంగా కాంతివంతంగా తయారవుతుంది. దీనిని ఉపయోగించడం వలన నల్లని మచ్చలు ,పింపుల్స్ , డార్క్ సర్కిల్స్ , వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలలో ఈ ప్యాక్ ను వెళ్లే పదినిమిషాల ముందు అప్లై చేసుకుంటేే చాలు ఇక అందరూ మీకు ఫిదా అయిపోతారు.