Hair Tips : ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి జుట్టు తెల్లబడిపోతుంది .దీనికి కారణం పొల్యూషన్ మరియు జుట్టు పై సరిగా శ్రద్ధ చూపించకపోవడం. ఈ తెల్ల జుట్టుతో సమాజంలో తిరగాలంటే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. అయితే దీనిని దాచిపెట్టడానికి మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రోడక్ట్స్ ను యూస్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రొడక్ట్స్ లో ఉండే అనేక రకాల కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతున్నారు. అలాగే ఈ ప్రోడక్ట్ ను అధికంగా వినియోగించడం వలన నల్లగా ఉన్న వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతున్నాయి. అయితే దీనికోసం మేము ఒక చిట్కాను తీసుకొచ్చాం. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం .
అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో దొరికే వస్తువులతో ఈ హెయిర్ డై ట్రై చేసినట్లయితే త్వరలోనే తెల్ల వెంట్రుకలు రావడం ఆగిపోతాయి. అలాగే తెల్లగా ఉన్న వెంట్రుకలు కూడా నల్లగా మారుతాయి.దీనికోసం ముందుగా ఒక బౌల్ ను తీసుకుని దానిలో మీరు రోజు వాడే షాంపూను మూడు చెంచాలు తీసుకోవాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల అలోవెరా జెల్ ను వేసుకోవాలి .లేదా అలోవెరా ప్లాంట్ నుండి వచ్చే గుజ్జును కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ రెండింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత ఒక కళాయి తీసుకుని మూడు చెంచాల టీ పొడిని వేసి స్టవ్ మీద వేయించుకోవాలి. అలా వేయించుకున్న టీ పొడిని కిచెన్ రోల్ లో వేసుకొని మెత్తగ పొడిలా రుబ్బుకోవాలి. ఇక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో దీనిని కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఓ రెండు చెంచాల మందార పొడిని కలుపుకోవాలి.కొంచెం గట్టిగా ఉన్నట్లయితే వాటర్ వేసుకొని బాగా కలిపి జుట్టు కు అప్లై చేసుకోవాలి. జుట్టుకు అప్లై చేసిన తర్వాత ఒక గంట వరకు అలా ఉండనివ్వాలి.ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వల్లన తెల్ల వెంట్రుకల సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు. ఈ చిట్కాను ఎలాంటి వయసు వారైనా ఉపయోగించవచ్చు. దీనివలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు.