Hair Tips : ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్ల వలన లేదా వాతావరణ పరిస్థితుల వలన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దీనిలో తెల్ల వెంట్రుకలు వస్తున్నాయనే సమస్య ఒకటి. పొల్యూషన్ వల్ల చిన్న వయసు గల వారికి కూడా తెల్ల వెంట్రుకలు రావడం సర్వసాధారణంగా మారింది. ఆ తెల్ల వెంట్రుకలను నల్లగా చేసుకోవడం కోసం మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ ను యూస్ చేస్తున్నారు. వాటిలో ఉండే కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో తెల్ల వెంట్రుకలు నల్లగాఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే దీనికి గుంటకలవరాకు కావలసి ఉంటుంది.
గుంటకలవరాకు మనం చేత్తో నలిపితేనే చెయ్యి మొత్తం నల్లగా మారిపోతుంది. ఇక అదే ఆకును జుట్టుకు ఉపయోగిస్తే జుట్టు ఇంకా నల్లగా మారుతుంది. అయితే గుంటకలవరాకు ను డైరెక్ట్ గా కాకుండా నూనెగా తయారు చేసుకుని వారంలో 3 సార్లు ఉపయోగించినట్లయితే తెల్ల వెంట్రుకలు తగ్గి జుట్టు నల్లగా మారుతుంది. అలాగే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.అయితే దీనికోసం ముందుగా గుంటకలవరాకు ను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి కడిగి పెట్టుకున్న గుంటకలవరాకును దాంట్లో వేసుకుని తడి పోయేంతవరకు వేయించుకోవాలి. నీరు మొత్తం ఇనికిపోయిన తర్వాత దానిలో 200 ml కొబ్బరి నూనెను వేసి మరిగించుకోవాలి.

నూనె ఆకులు మొత్తం నల్లగా అయ్యేంతవరకు అలాగే మగ్గనివ్వాలి. దాని తర్వాత స్టౌ ఆఫ్ చేసి నూనె ను చల్లార్చుకోవాలి . చల్లార్చిన నూనెను వాడకట్టుకుని ఒక గ్లాస్ లో పోసుకోవాలి. ఇంకా ఇది కొన్ని కాలాలపాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను వారంలో రెండు లేదా మూడుసార్లు ఉపయోగించడం వలన తెల్ల జుట్టు తగ్గి జుట్టు మొత్తం నల్లగా మారుతుంది. అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నుండి పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. అప్పుడే బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు బలంగా తయారవుతుంది. దీన్ని వయసు తో సంబంధం లేకుండా ఎలాంటి వయసు వారైనా ఉపయోగించవచ్చు.