Health Tips : తస్మాత్ జాగ్రత్త… కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఐదింటిని తింటే ఇక అంతే …!

Advertisement

Health Tips : ప్రస్తుత కాలంలో చాలామంది కీళ్ల నొప్పులు మరియు ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు. మనం తీసుకునే ఆహారం కారణంగా లేదా పోషకాల లోపం వలన ఇవి సంభవిస్తున్నాయి .ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి మరియు ఎముకలకు హాని కలిగించే ఆహారాలను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ముందుగా తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటే మంచిది.అనారోగ్యకరమైన ఆహారం మరియు పానీయాలను దూరం పెట్టి వీటికి బదులుగా ప్రోటీన్స్ మరియు పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచిది.అలాగే ప్రతిరోజు ఉదయం యోగ చేయడం ద్వారా నిత్యం వచ్చే ఎముకల నొప్పుల నుండి బయటపడవచ్చు.

Advertisement

యోగ అనేది మానసిక వత్తుల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ప్రతిరోజు యోగ చేయడంతో పాటు కొన్ని పదార్థాలను దూరంగా పెట్టడం ,ద్వారా ఎముకల నొప్పులు నుండి మీరు త్వరగా ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం .*ఉప్పు చక్కెర వాడకం తగ్గించాలి… ఉప్పు ,చక్కెర అనేవి మన రోజువారి జీవితంలో ఎక్కువగా ఉపయోగించే పదార్థాలు.మన ఆహారంలో ఇవి లేకుండా మంచి రుచిని ఆశించలేం.కానీ ఉప్పు చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరంలో కాల్షియం లోపిస్తుంది.ఇది ఎముకల బలహీనతకు దారితీస్తుంది.కావున వీటిని పరిమితికి మించి అస్సలు తినకూడదు.

Advertisement
avoid these foods for good bone health causes of bone pain
avoid these foods for good bone health causes of bone pain

* టీ , కాఫీలను తగ్గించాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి టీ కాఫీలు ఒక వ్యసనంలా మారాయి.ప్రతి ఒక్కరూ పని ఒత్తిడిని తట్టుకోవడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.కాని వీటిని అధిక మోతాదులో తీసుకోవడం వలన వీటిలో ఉండే కెఫిన్ కాల్షియం లోపానికి దారి తీస్తుంది.వీటిని తీసుకోవడం ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిది.

*చల్లని పానీయాలు త్రాగరాదు.శీతల  పానీయాలను ఎక్కువగా తీసుకోవడం వలన అనేక రకాల నొప్పులకు గురవుతారు.వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండటం మంచిది. గమనిక : పైన పేర్కొనబడినవి నిపుణుల అధ్యయనాల ఆధారంగా వ్రాయబడినవి. అధిక సమస్యతో బాధపడేవారు ముందుగా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Advertisement