Health Tips : మనం ప్రతిరోజు మన వంటింట్లో అల్లంని చూస్తూ ఉంటాము. అయితే అల్లం గ్యాస్టిక్ మరియు అజీర్ణ సమస్యలను దూరం చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇక పూర్వకాలంలో ఎవరికి అయిన పొట్ట బాగోలేకపోయినా, అరుగుదల లేకున్నా, ఆకలి అవ్వకపోయినా, అల్లం ను నూరి దాన్ని లడ్డూల్లా చేసి దానిలోని రసాన్ని తీసేవారు. ఇలా పచ్చి అల్లం రసాన్ని ఒక స్పూన్ తీసుకొని దానిలో రెండు స్పూన్లు తేనె కలుపుకొని నాలుక పైన నాకించేవారట. దీన్ని ఎక్కువగా పరగడుపున చేయడం వలన మంచి ఫలితం లభిస్తుంది. అలాగే అల్లం లోని కెమికల్స్ ఆకలిని బాగా పెంచడంలో సహాయపడతాయి.
అలాగే అల్లం రసంలో కొద్దిగా తేనె కలుపుకొని వేడి చేసుకుని తాగితే రుచి కూడా బాగుంటుంది. ఇలా చేయడం వలన అల్లం పచ్చివాసన కూడా పోయి ఫ్రెష్ గా అనిపిస్తుంది. పచ్చి రసం తాగలేము అనుకునేవారు ఇలా తేనెను కలుపుకొని వేడి చేసుకుని తాగండం మంచిది . అలాగే అల్లం రసం ను అప్పుడప్పుడు తీసుకోవడం వలన జీర్ణకోశ సంబంధ సమస్యలను తగ్గించడానికి ఈ రసం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఇది రక్తనాళాలు గడ్డకట్టనీయకుండా కాపాడుతుంది. మలబద్ధకం ను దూరం చేసి ఫ్రీగా మోషన్ అయ్యేలా చేస్తుంది.

ఈ అల్లం రసం రోజు తీసుకోవడం వల్ల జలుబు దగ్గు జ్వరం లాంటివి రాకుండా ఉంటాయి. దీన్ని నిత్యం వాడడం వలన శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు దీన్ని ప్రతి రోజు పరిగడపున తీసుకోవడం వలన అతి కొద్ది రోజుల్లోనే బరువు తగ్గడాన్ని గమనిస్తారు. అలాగే ఈ అల్లం రసం డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఇక కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ రసంను, రోజు ఉదయం పరిగడుపున తీసుకోవడం వలన మంచి ఫలితం లభిస్తుంది.