Beauty tips : ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తాము అందంగా కనిపించాలని కోరుకుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు.అలాగే కొంతమంది బ్యూటీ పార్లర్లకు వెళ్లి ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వలన లేనిపోని సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆ ప్రోడక్ట్స్ లో ఉండే కెమికల్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా ఫలితం ఉండే చిట్కాను మేము మీకోసం తీసుకొచ్చాం.
దీనికోసం ముందుగా పండిన అరటిపండు తొక్క ను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. దానిని ఒక గ్లాస్ నీటిలో వేసి స్టవ్ మీద వేడి చేయాలి. ఇంట్లో ఉడికిన అన్నం ఉంటే కొంచెం వేసుకోవచ్చు. ఒకవేళ అన్నం లేకపోతే రెండు చెంచాల బియ్యం వేసి ,అరటిపండు తొక్కతోపాటు ఉడికించుకోవాలి. అంత మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి .అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని అప్లై చేసుకోవాలి.

అప్లై చేసిన తర్వాత 30 నిమిషాల వరకు దాన్ని అలా వదిలేయాలి .అది ఆరిన తర్వాత పెచ్చులు పెచ్చులుగా ఊడి రావడాన్ని మీరు గమనిస్తారు. 30 నిమిషాల తర్వాత వాటర్ తో ముఖంను క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం వలన ముఖంపై ఉండే జిడ్డు మొత్తం పోతుంది. అలాగే మొటిమలు , నల్లని మచ్చలు , డార్క్ సర్కిల్స్ వంటివి కూడా తగ్గుతాయి. ఈ న్యాచురల్ చిట్కాను ఉపయోగించడం వలన మంచి ఫలితం లభిస్తుంది, అలాగే దీనిలో ఉపయోగించే పదార్థాలు మన ఇంట్లో దొరికేవి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురికారు.