Almond Benefits : బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది తినడం వలన ఆరోగ్య సమస్యలు దూరం కావడమే కాక మల బద్ధకం కూడా పోతుందని అంటుంటారు. బాదంపప్పును క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఐతే చాలా మంది నానబెట్టిన బాదం తినేందుకు ఇష్టపడతారు. రాత్రంతా నానబెట్టి.. ఉదయం పొట్టు తీసి ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనం ఉంటుంది. బాదంపప్పులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి మేలు చేస్తాయి రోజూ ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల మీ ముఖంలో మెరుపు పెరుగుతుంది. అందంగా తయారవుతారు. జీర్ణవ్యవస్థను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఖాళీ కడుపుతో బాదంపప్పును తినవచ్చు. బాదంపప్పును తీసుకోవడం ద్వారా ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా కదలిక మెరుగుపడుతుంది.
Almond Benefits : బాదం ఉపయోగాలు..

బాదంపప్పులో ఉండే అధిక ఫైబర్ మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్లతో బంధించి శరీరంలోని వాటి శోషణ తగ్గిస్తుంది. బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది.బాదంపప్పును శక్తి వనరుగా కూడా పరిగణిస్తారు. ఇందులో ఉండే పోషకాలు నీరసాన్ని, అలసటను దూరం చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల శరీర కణజాలాలకు అవసరమైన తేమను అందిస్తుంది. చర్మం రంగును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం బాదంలో శరీర ద్రవ్యరాశి, బలాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉంటుంది.
బాదంపప్పును నానబెట్టకుండా కూడా తినవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవాలి. బాదంపప్పు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. బాదం పప్పును ఖాళీ కడుపుతో తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో.. అదే విధంగా కూడా కొన్ని నష్టాలు ఉంటాయి. ఖాళీ కడుపుతో బాదంపప్పును తీసుకోవడం వల్ల ఫుడ్ అలర్జీ వస్తుంది. గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో బాదంపప్పు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.బాదంలో ఉండే పీచు కారణంగా శరీరంలో గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. బాదంపప్పులో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి పేగులో కరిగే సమ్మేళనాలు. ఆక్సలేట్లు అధికంగా ఉండటం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఉంది.