Health Tips : ప్రతి ఒక్కరు రోజు ఏదో పని చేస్తూనే ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసే సరికి రాత్రివేళ అలసిపోయి చాలా నీరసం అయిపోతారు. ఆ నీరసం పోగొట్టుకోవడానికి ఏం చేసినా సరే ఆ నీరసం మాత్రం తగ్గదు. ఇక వీటికి మెడిసిన్స్ వాడిన ఎలాంటి ప్రయోజనం ఉండదు.ఈ సమస్య తో బాధ పడేవారు ఒకసారి ఈ డ్రింక్ ని తయారు చేసుకుని తాగి చూడండి. మీలో ఉన్న నీరసం మొత్తం తగ్గి రోజంతా యాక్టివ్ గా ఉంటారు. అయితే దీనికోసం ముందుగా ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కిచెన్ రోల్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
అలాగే లవంగాలను కూడా పొడి లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ మామూలు నీళ్లు తీసుకుని ఆ నీటిలో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ను వేసుకోవాలి .అలాగే ఆఫ్ చెంచా లవంగాలు పొడిని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసుకొని వడకట్టుకోవాలి. వడకట్టిననీటిలో ఒక చెంచా తేనెను వేసుకొని బాగా కలుపుకొని ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి ఒక గంట ముందు దీనిని తాగాలి. ఇలా చేయడం వలన మీ నీరసం ఇట్టే మాయమవుతుంది.

ఇక రోజు మొత్తం మీరు ఎంత పనిచేసి వచ్చినా సరే నీరసం అనిపించదు. దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. రోజులో కొంచెం పని చేసి కూడా నీరసంగా ఉంటుందనుకునేవారు ఒక్కసారి ఈ డ్రింక్ ను తాగి చూడండి. కొద్ది రోజుల్లోనే రిజల్ట్ ను చూస్తారు. అలాగే ఈ డ్రింక్ నీరసం తగ్గించడానికే కాకుండా శరీరంలో అధిక బరువు మరియు కొలెస్ట్రాన్ని తగ్గించడంలో కుడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమస్యలతో బాధపడేవారు ఒక్కసారి దీన్ని తాగి చూడండి చాలా కొద్ది రోజుల్లోనే శరీరంలోని మార్పులను గమనిస్తారు. అయితే ఈ సమస్యతో ఎక్కువ బాధపడేవారు ముందుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.