Hair Problem : ప్రకృతిలో లభించేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. కరివేపాకుని అందరు విరివిగా వాడుతుంటారు. కరివేపాకు వేయకుండా మహిళలు ఏ కూర కూడా చేయరు. అయితే ప్లేట్ లో కరివేపాకు కనిపించగానే కొందరు తీసి పక్కన పెడతారు . అయితే.. కరివేపాకును తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఆహారంలో కరివేపాకు వాడడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జుట్టు సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాకుండాఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు నల్లబడుతుంది.
ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి. కరివేపాకుల్లో ఉండే ఫైబర్ ఇన్సులిన్‌ను ప్రభావితం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. కరివేపాకు మనం అధికంగా బరువు పెరగకుండా నియంత్రిస్తుంది. కరివేపాకుతో పాటు, దాని నూనె కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది యాంటీబయోటిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది, ఇది అనేక ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. కరివేపాకు చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఈ ఆకులను నీటితో ఉడకబెట్టడం మరియు దానితో స్నానం చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల సమస్య పరిష్కారమవుతుంది.

Hair Problem : ఎంత ఉపయోగం అంటే..
ముఖ్యంగా జుట్టు సమస్యలకు కరివేపాకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. జుట్టు నల్లగా మారడానికి కరివేపాకును నూనె, హెయిర్ మాస్క్‌గా కూడా ఉపయోగించవచ్చు.కరివేపాకు నూనెను తయారు చేయడానికి.. ముందుగా 1 గిన్నెలో కరివేపాకు తీసుకోవాలి. ఆ తరువాత 1 గిన్నె కొబ్బరి నూనె, సగం గిన్నె తరిగిన ఉల్లిపాయలను తీసుకోండి. దీని తర్వాత గిన్నెలో నూనె వేడి చేయండి. కరివేపాకు, ఉల్లిపాయలు వేసి కాసేపు ఉడికించాలి. నూనె రంగు మారిన తర్వాత మంటను ఆపేసి.. ఇప్పుడు ఈ నూనెను చల్లారనివ్వాలి. తర్వాత మీ అవసరాన్ని బట్టి జుట్టుకు అప్లై చేయండి. ఇలా చేయడం వలన జుట్టు రాలకుండా ఉండే సమస్యను కాస్త తగ్గించుకోవచ్చు.