Hair Tips : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు, జుట్టు రాలడం,చుండ్రు ,తెల్ల జుట్టు వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. వీటిని తగ్గించుకోడం కోసం మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ నీ వినియోగిస్తున్నారు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ అనేక రకాల రసాయనాలతో తయారుచేయబడతాయి. ఇవి జుట్టు కు హాని కలిగించడం తో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు దారితిస్తున్నాయి. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండ న్యాచురల్ గా ఇంట్లో దొరికే వాటితోనే తయారు చేసుకునేలా మీకోసం ఒక చిట్కా నీ తీసుకువచ్చాం. దీనికోసం ముందు గా అల్లం తీసుకుని పై తొక్క నీ తీసుకోవాలి.
తర్వాత దాన్ని మెత్తగా నూరుకోవాలి. లేదా మిక్సీ సాయం తో మెత్తగా చేసుకోండి. తరువాత రెండు టేబుల్ స్పూన్స్ లవంగాలు తీసుకుని మెత్తగా పౌడర్ ల తయారుచేసుకోవాలి. అల్లం పోటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ నీ కలిగి ఉంటుంది. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కుదులకి బలాన్ని చేకూరుస్తుంది. తెల్ల జుట్టు ను తగ్గించి జుట్టు నల్లగా అవ్వడానికి సహాయపడుతుంది. లవంగాలు జుట్టు ఒత్తుగా,సిల్కీగా అవ్వడానికి సహాయపడతాయి. అలాగే చుండ్రు, దురద వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ముందు గా మనం తురుముకున్న అల్లం నీ వేసుకుని తరువాత 2 టేబుల్ స్పూన్స్ లవంగాల పొడిని యాడ్ చేసుకోవాలి.

తర్వాత ఒక కప్ కోకోనట్ ఆయిల్ ను యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి స్టవ్ మీద పెట్టి 5 నుండి 10 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా మరిగించుకున్న నూనె ను చల్లర్చుకుని వడకట్టుకోవాలి. ఈ ఆయిల్ ను తీసుకుని జుట్టు కుదులకి వెళ్లేలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తరువాత 4 నుండి 5 గంటలు ఉండనివ్వాలి. లేదా నైట్ అప్లై చేసుకుని ఉదయం లెచి తల సానం చేస్తే సరిపోతుంది . ఇలా వారంకి ఒకటి లేదా రెండు సార్లు చేయడం వలన జుట్టు రాలడం ,చుండ్రు ,తెల్ల జుట్టు లాంటి సమస్యలను తగించుకోవచ్చు.