Health Benefits : ప్రస్తుతం వాతావరణంతో పాటు అనేక పరిస్థితుల వలన చాలా మంది నిత్యం అనారోగ్యం బారిన పడుతున్నారు. డీ హైడ్రేషన్, తల నొప్పి, చర్మం పగుళ్లు, పొడిబారడం, మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలు ఇలాంటి వాటితో తెగ బాధపడుతున్నారు. అయితే మన శరీరాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని పెద్దలు చెబుతుంటారు. మన ఇంటి పరిసరాలలో దొరికే కలబంద వలన ఎన్నో సమస్యలు నయం అవుతాయి. రోజూ ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
కొంత చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.వీటికి పరిష్కారంగా కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజూ పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోయి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మలబద్ధకాన్ని కూడా ఇది దూరం చేస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలకు రావడానికి ముఖ్య కారణంగా మలబద్ధకాన్ని చెప్పవచ్చు. రోజూ ఉదయాన్నే కలబంద జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇక వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు.

Health Benefits : బహు ప్రయోజనాలు..
ఇలాంటివారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. చాలామందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గి రక్తహీనత బారిన పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవ్వడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతుంది. కలబంద రసం తీసుకోవడం వలన ఎర్రరక్త కణాలు పెరిగి అలసట తగ్గుతుంది. కలబందను ముఖానికి, జుట్టుకు రాయడం వంటివి చాలామందికి చేస్తుంటారు. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ ఉంటుంది. కలబంద వలన కొన్ని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి.