Health Benefits : వర్షాకాలం వస్తే చాలా మందికి స్పైసీ స్పైసీగా తినాలని అనిపిస్తుంది. వేడివేడిగా ఘాటుగా ఘుటుగా తినాలని అనుకుంటారు. నాన్వెజ్పైనే ఎక్కువ దృష్టి సారిస్తారు. ఇక కూరగాయల విషయంలో కొంత సెలక్షన్ అనేది తప్పక ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ సీజన్లో మీరు తినే కూరగాయల గురించి చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎంపిక చేసిన కొన్ని కూరగాయలను మాత్రమే తీసుకోవడం మంచిది. అవి తీసుకుంటే వర్షాకాలంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా హెల్తీగా ఉంటారు. వర్షాకాలంలో టొమాటో తీసుకోండి. టొమాటో ప్రతి భారతీయ కూరగాయలకు గర్వకారణం. దీనిని వెజిటేబుల్ లేదా సూప్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు.టొమాటో సులువుగా పండే కూరగాయలు. కాకరకాయ తినడం కూడా చాలా మేలు చేస్తుంది.
దీని ప్రయోజనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ కాకరకాయ ప్రతి సీజన్లో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీవైరల్ గుణాలు వర్షం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. వర్షాకాలంలో పొట్లకాయ ప్రయోజనకరమైనది. దీని వల్ల జీర్ణక్రియ బాగానే ఉంటుంది. పొట్లకాయలో ఐరన్, విటమిన్ బి, సి పుష్కలంగా ఉన్నాయి, ఇది వర్షంలో శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.దోసకాయ తినడం చాలా మంచిది. దోసకాయ సలాడ్లు లేదా శాండ్విచ్ లకు సరైన కలయిక. బెండకాయ తినడం చాలా మేలు చేస్తుంది. దీని వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా బెండకాయ తినడం వల్ల కంటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలు దూరంగా ఉంటాయి.

Health Benefits : ఇవి తీసుకోండి..
దీంతో ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.ఇక ఆకుకూరలతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. దీని వలన మీ ఆరోగ్యం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో రుచికరమైన ఫుడ్‌ని కాస్త పక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. వంకాయలు ఈ కాలంలో తినకపోవడం మంచింది.. నీలం రంగు వంకాయలలో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆల్కలాయిడ్ అలెర్జీ వల్ల చర్మం దద్దుర్లు, దురద, స్కిన్ రాషెస్ వంటివి వస్తాయి. అందువల్ల వంకాయలను వర్షాకాలం దూరంగా పెట్టడమే మంచింది. క్యాప్సికమ్ తిసుకుంటే.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. క్యాప్సికమ్‌లో గ్లూకోసినోలేట్స్ అనే కెమికల్ ఉంటుంది. దీనివల్ల వాంతులు విరోచనాలు, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాలీఫ్లవర్‌ను కూడా తక్కువగా తీసుకోవడం మంచింది. వీటి వలన అలెర్జీలు కలిగిస్తాయి.