Health Benefits : మన ఇంటి పెరట్లో పెరిగే కూరగాయలలో కాకరకాయ కూడా ఒకటి. ఇది రుచికి చేదుగా ఉన్నా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కాకరకాయని కూర లేదంటే ఫ్రైలా చేసుకొని తింటారు. కాకయ కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను కూడా నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. . కాకర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావని చెబుతున్నారు.
మనం కాకరకాయను ఇష్టపడం..అలాంటి వారి కోసమే కాకరకాయ టీని తీసుకొచ్చారు. కాకర కాయల కూర తినలేనివారికి ఇదొక ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. కాకర టీ వలన కరోనా వల్ల శరీరం దెబ్బతిన్న వారికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దరి చేరనివ్వదు. కాకరకాయ తింటే మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. కాకరకాయ జ్యూస్‌ను తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరుగుతాయని ఓ నివేదిక చెబుతుంది.

Health Benefits : చేదు అయిన మేలు..
కాకరకాయలో ఉన్న ఆల్కలైడ్లు బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తాయట. బరువు నియంత్రణలో కాకర కాయ రసం ఇతోధికంగా తోడ్పడుతుంది. కాకర జ్యూస్‌తో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. బరువు తగ్గడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులకు దారితీసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ను కాకర జ్యూస్ అదుపులో ఉంచడం ఖాయం. కాకర రసంతో హృద్రోగాల బారినపడకుండా గుండెను పదిలంగా ఉంచుకునే ఛాన్స్ ఉంది. రోజూ కాకర రసం తాగుతుంటే ఎంతో మేలు కలుగుతుంది. ఇది శరీరంలోని మలినాలను తొలగించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. కాకర రసం రక్తం, లివర్‌లో వ్యర్ధాలను తొలగించడమే కాకుండా శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.